Lok Sabha Elections: మాట్లాడేటప్పుడు జాగ్రత్త... రాహుల్‌కు ఈసీ కీలక సూచన
ABN, Publish Date - Mar 06 , 2024 | 09:36 PM
బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం ) కీలక సూచన చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాహుల్ గత ఏడాది ''పనౌటి'' (చెడు శకునం), పిక్‌పాకెట్ అని సంబోధించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు మార్చి 1న ఈసీ తాజా సూచనలు చేసింది.
న్యూఢిల్లీ: బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక సూచన చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాహుల్ గత ఏడాది ''పనౌటి'' (చెడు శకునం), పిక్‌పాకెట్ అని సంబోధించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు మార్చి 1న ఈసీ తాజా సూచనలు చేసింది.
ఎన్నికల రాజకీయ ప్రసంగాలు హద్దు మీరుతుండటం గుర్తించిన ఈసీఐ గత వారంలో అన్ని పార్టీలకు సూచనలు చేసింది. ప్రసంగాల సమయంలో నేతలు సంయమనం పాటించాలని సూచించింది. రాహుల్ గాంధీ గత ఏడాది రాజస్థాన్‌లోని జాలోర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీని 'పనౌటీ' అని పిలిచారు. అందువల్లే అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను ఓడిపోయిందన్నారు. బర్మెర్‌లో జరిగిన మరో ర్యాలీలో మోదీని పిక్‌పాకెట్ అని పిలిచారు. పిక్‌పాకెటర్లు ఒంటరిగా రారని, ముగ్గురు ఉంటారని, ఒకడు ముందు నుంచి, మరొకరు వెనుక నుంచి వస్తారని, మూడోవాడు దూరంగా ఉంటాడని చెప్పారు. హిందూ-ముస్లిం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అంటూ ప్రజల దృష్టి మళ్లిస్తుంటారని, అదనీ వెనుక నుంచి వచ్చి డబ్బులు దోచుకుపోతారని విమర్శించారు. దీనిపై గత ఏడాది డిసెంబర్‌లో రాహుల్‌పై చర్య తీసుకోవాలని ఈసీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో రాహుల్‌కు ఈసీ గత వారంలో అడ్వయిజరీ జారీ చేసింది. బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Updated Date - Mar 06 , 2024 | 09:36 PM