ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jagadambika Pal: తృటిలో తప్పించుకున్నా.. దాడి ఘటనపై జేపీసీ చీఫ్

ABN, Publish Date - Oct 23 , 2024 | 08:43 PM

కమిటీ ప్రొసీడింగ్స్ గురించి కానీ, చర్చించిన అంశాల గురించి తాను బయటకు వెల్లడించడం లేదని, కమిటీ సమావేశంలో ఒక సభ్యుడు హింసాత్మక చర్చలకు పాల్పడటం, అందుకు ఆయనను సస్పెండ్ చేయడం గురించే తాను స్టేట్‌మెంట్ ఇచ్చానని జగదాంబికా పాల్ వివరణ ఇచ్చారు. పార్లమెంటరీ నిబంధనలు, సభా గౌరవం పట్ల తనకు విశ్వాసం ఉందన్నారు.

న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లుపై జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుచిత వైఖరిపై జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ (Jagdambika pal) బుధవారంనాడు సంచలన ఆరోపణలు చేశారు. కల్యాణ్ బెనర్జీ గాజు గ్లాసును టేబుల్‌పై పగులగొట్టి తనపై విసిరారని, భగవంతుడి దయవల్ల తృటిలో తాను గాయపడకుండా తప్పించుకున్నానని తెలిపారు.

Mehbooba Mufti: పాక్‌తో సయోధ్యే పరిష్కారం.. మెహబూబా ముఫ్తీ పాత పాట


''జేపీసీ సమావేశంలో కల్యాణ్ బెనర్జీ గాజు గ్లాసు పగులగొట్టి ఆ కోపంలో దానిని నాపై విసిరారు. దేవుడి దయవల్ల తృటిలో ఆపాయం తప్పింది'' అని జగదాంబిక పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఎక్కువ సేపు కల్యాణ్ బెనర్జీనే మాట్లాడరని తెలిపారు. దాడి విషయాన్ని స్పీకర్‌కు తెలియజేశాననీ, ఇది పార్లమెంటరీ వ్యవస్థపైనే జరిగిన తీవ్రమైన దాడి అని అన్నారు. జేపీసీలో ఎక్కువ సేపు మాట్లాడింది కూడా బెనర్జీయేనని, సమావేశంలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వలేదని ఎవరైనా ఆరోపిస్తే పదవికి రాజీనామా చేయడానికి కూడా తాను సిద్ధమేనని చెప్పారు. కల్యాణ్ బెనర్జీ తదుపరి జేపీసీ సమావేశం నుంచి బహిష్కరిస్తూ జేపీసీ సమావేశంలో తీర్మాన్ని ఆమోదించినట్టు తెలిపారు.


కమిటీ ప్రొసీడింగ్స్ గురించి కానీ, చర్చించిన అంశాల గురించి తాను బయటకు వెల్లడించడం లేదని, కమిటీ సమావేశంలో ఒక సభ్యుడు హింసాత్మక చర్చలకు పాల్పడటం, అందుకు ఆయనను సస్పెండ్ చేయడం గురించే తాను స్టేట్‌మెంట్ ఇచ్చానని జగదాంబికా పాల్ వివరణ ఇచ్చారు. పార్లమెంటరీ నిబంధనలు, సభా గౌరవం పట్ల తనకు విశ్వాసం ఉందని, వాటిని ఎన్నడూ ఉల్లంఘించేది లేదని స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుపై మంగళవారం పలువురు న్యాయమూర్తులు, లాయర్ల అభిప్రాయాలను జేపీసీ వింటున్న క్రమంలో కల్యాణ్ బెనర్జీ ఆగ్రహావేశాలతో ఊగిపోతో గాజు గ్లాసు పగులగొట్టి దాన్ని విసిరేశారు. ఈ ఘటనలో ఆయన చేతి వేళ్లకు గాయం కావడంతో ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి పంపారు.


ఇవి కూడా చదవండి..

Priyanka Gandhi: మీలో సొంత కుటుంబ సభ్యులను చూస్తున్నా.. వయనాడ్ సభలో ప్రియాంక ఎమోషనల్..

Priyanka Gandhi: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ.. వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్..

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 23 , 2024 | 08:43 PM