ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lok Sabha: 80 సీట్లు గెలిచినా ఈవీఎంలను నమ్మం: అఖిలేష్

ABN, Publish Date - Jul 02 , 2024 | 04:47 PM

పార్లమెంటులో ఈవీఎంల అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈవీఎంల విశ్వసనీయతను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, కన్నౌజ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ లోక్‌సభలో మంగళవారం ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ 80 సీట్లు గెలిచినా సరే తాను ఈవీఎంలను నమ్మేది లేదని అన్నారు.

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఈవీఎంల (EVMs) అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈవీఎంల విశ్వసనీయతను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, కన్నౌజ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) లోక్‌సభలో మంగళవారం ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ 80 సీట్లు గెలిచినా సరే తాను ఈవీఎంలను నమ్మేది లేదని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేసినప్పటికీ ప్రభుత్వం, కమిషన్ కొందరి వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించినట్టు ఆయన ఆరోపించారు. అయితే ఆ వివరాల్లోకి తాను వెళ్లదలచుకోలేదని చెప్పారు. ఈవీఎంల అంశం తెరమరుగు కాలేదని, సమాజ్‌వాదీ పార్టీ దీనిపై పట్టుబడుతూనే ఉంటుందని అన్నారు.


పేపర్ లీక్ అంశం, అయోధ్య ఫలితంపై..

పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై కూడా అఖిలేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. పేపర్ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వమే ఆ పని చేస్తోంది. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేకపోవడమే ఇందుకు కారణం'' అని అఖిలేష్ విమర్శించారు. ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమిని ప్రస్తావిస్తూ, బహుశా అది రాముడి అభిమతం కావచ్చని అన్నారు. రాముడు ఏది ప్లాన్ చేస్తే అదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. అయోధ్యలో విజయాన్ని పరిపక్వ భారతీయ ఓటర్ల ప్రజాస్వామిక విజయంగా ఆయన అభివర్ణించారు. లోక్‌సభలో అఖిలేష్ ప్రసంగిస్తున్న సమయంలో ఫైజాబాద్ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అవదేష్ కుమార్ ఆయన పక్కనే కూర్చున్నారు.

Rajya Sabha: బీహార్ నుంచి రాజ్యసభకు ఉపేంద్ర


నేను కూడా సైనిక స్కూలులో చదివా..

అగ్నిపథ్ పథకంపై కూడా అఖిలేష్ విమర్శలు ఎక్కుపెట్టారు. తాను కూడా మిలటరీ స్కూలులో చదవానని, అగ్నివీర్ పథకంపై అనేక మంది అధికారులను కలిసానని, మన ఆర్మీని ఈ పథకం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని వారు తనతో చెప్పారని తెలిపారు. ఈ పథకాన్ని కేంద్రం రద్దు చేయకుంటే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పథకాన్ని తొలగిస్తుందని అఖిలేష్ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jul 02 , 2024 | 04:47 PM

Advertising
Advertising