Congress on RSS: ఆర్ఎస్ఎస్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు.. ఇంద్రేష్ కుమార్‌కు కాంగ్రెస్ కౌంటర్
ABN, Publish Date - Jun 14 , 2024 | 04:35 PM
కేంద్రంలోని అధికార బీజేపీ, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష 'ఇండియా' కూటమిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తొలిసారి స్పందించింది. ఆర్ఎస్ఎస్‌ను సీరియస్‌గా పట్టించుకోనవసరం లేదని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: కేంద్రంలోని అధికార బీజేపీ, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష 'ఇండియా' (I.N.D.I.A.)కూటమిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ (Indresh Kumar) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ (Congress) పార్టీ తొలిసారి స్పందించింది. ఆర్ఎస్ఎస్‌ను సీరియస్‌గా పట్టించుకోనవసరం లేదని స్పష్టం చేసింది.
''ఆర్ఎస్ఎస్‌ను సీరియస్‌గా తీసుకున్నదెవరు? ప్రధాని మోదీ సైతం వారిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. మేము (కాంగ్రెస్) ఎందుకు తీసుకుంటాం? ఆయన (ఇంద్రేష్ కుమార్) సరైన సమయంలో మాట్లాడి ఉంటే ప్రతి ఒక్కరూ వారిని పట్టించుకునే వాళ్లు. మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉన్నారు. వారు కూడా అధికారాన్ని అనుభవించారు'' అని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేర శుక్రవారంనాడిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.
JDU on LS Speaker: లోక్‌సభ స్పీకర్ పదవిపై జేడీయూ వైఖరి ఇదే...
ఇంద్రేష్ కుమార్ ఏమన్నారు?
ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఇంద్రేష్ కుమార్ అటు బీజేపీని, ఇటు 'ఇండియా' కూటమిని సైతం తప్పుపట్టారు. బీజేపీ 'అహంకారం'తో, ఇండియా బ్లాక్ రామునికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టు జైపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు. అయితే నేరుగా పేర్లు ప్రస్తావించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భక్తి కలిగిన పార్టీ అహంకారానికి పోయిందని, 241 (240) వద్దనే ఆగిపోయిందని, అయితే అతిపెద్ద పార్టీగా నిలిచిందని చెప్పారు. రాముడి మీద విశ్వాసం లేని వారు (కాంగ్రెస్) 234 వద్దనే ఆగిపోయారని చెప్పారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య విభేదాలు తలెత్తాయనే ఆరోపణలు, ఊహాగానాల నేపథ్యంలో ఇంద్రేష్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో సొంతంగా 400కు పైగా సీట్లు అశించిన బీజేపీ 240 సీట్లకే పరిమితమై గత రెండు సార్లు సాధించిన సంపూర్ణ మెజారిటీకి దూరమైంది. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని మాత్రం సాధించింది. కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.
For More National News and Telugu News..
Updated Date - Jun 14 , 2024 | 04:35 PM