Prajwal Revanna Case: జర్మనీ నుంచి బెంగుళూరు బయలుదేరిన ప్రజ్వల్..!
ABN, Publish Date - May 30 , 2024 | 05:27 PM
రాసలీల పెన్ డ్రైవ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగుళూరుకు బయలుదేరారు. గురువారం ఉదయం 11.20 గంటలకు జర్మనీలో మ్యూనిచ్ నగరంలోని ఎయిర్ పోర్ట్ నుంచి బిజినెస్ క్లాస్ విమానంలో ప్రజ్వల్ బెంగుళూరుకు బయలుదేరారు.
బెంగుళూరు, మే 30: రాసలీల పెన్ డ్రైవ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగుళూరుకు బయలుదేరారు. గురువారం ఉదయం 11.20 గంటలకు జర్మనీలో మ్యూనిచ్ నగరంలోని ఎయిర్ పోర్ట్ నుంచి బిజినెస్ క్లాస్ విమానంలో ప్రజ్వల్ బెంగుళూరుకు బయలుదేరారు. రేపు అంటే మే 31వ తేదీ తెల్లవారుజామున ప్రజ్వల్ బెంగుళూరు మహనగరానికి చేరుకోనున్నారు. అయితే ప్రజ్వల్‌ను బెంగుళూరు ఎయిర్ పోర్ట్‌లోని సిట్ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: పోస్టాఫీసులకు క్యూ కడుతున్న మహిళలు ఎందుకుంటే..?
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. జేడీ(ఎస్) నాయకుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రాసలీల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినాయి. ఆ క్రమంలో ఆయన జర్మనీ వెళ్లిపోయారు. దాంతో కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. అదీకాక ఈ ఎన్నికల్లో కర్ణాటకలో జేడీఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ చేతికి సరైన సమయంలో ప్రజ్వల్ అంశం విమర్శనాస్త్రంగా చిక్కినట్లు అయింది. దాంతో బీజేపీ, జేడీఎస్‌లనే లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ విమర్శలు గుప్పించింది.
Also Read: మోదీ ధ్యానంపై ఈసీకి లేఖ
మరోవైపు ప్రజ్వల్ తమపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇద్దరు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. దాంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకోవైపు ప్రజ్వల్‌పై విమర్శలు అధికమయ్యాయి. దీంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జేడీ(ఎస్) ప్రకటించింది. ప్రజ్వల్ వ్యవహారంపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: ప్రధాని మోదీ సభలో ‘ఆమె’ ఎవరు?
అలాగే జేడీ(ఎస్) నాయకుడు, మాజీ ప్రధాని దేవగౌడ సైతం తన మనవడు ప్రజ్వల్‌కు లేఖ రాసి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే బెంగుళూరు తిరిగి రావాలని సూచించారు. సిట్ పోలీసుల ముందు హాజరు కావాలన్నారు. ఈ విషయంలో తన సహానాన్ని పరీక్షించవద్దంటూ ప్రజ్వల్‌కు దేవగౌడ లేఖ ద్వారా హెచ్చరించారు. ప్రజ్వల్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో గత కొన్ని వారాలుగా తమ కుటుంబం తీవ్ర మానసిక్ క్షోభ ఎదుర్కొంటుందని దేవగౌడ తెలిపారు. అయితే తాను మే 31వ తేదీ ఉదయం సిట్ పోలీసుల ముందు హాజరవుతానని ప్రజ్వల్ స్పష్టం చేశారు. అలాగే తనకు న్యాయ వ్యవస్థ పట్ల, చట్టం పట్ల గౌరవం ఉందన్నారు. ఈ మేరకు వీడియో సందేశంలో ప్రజ్వల్ పేర్కొన్నారు.
Also Read: భారీగా పెరిగిన రాజకీయ పార్టీలు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 30 , 2024 | 05:47 PM