Lok Sabha Elections: చెస్, రాజకీయాల్లో రాహుల్ నిష్ణాతుడు... కాంగ్రెస్ కౌంటర్
ABN, Publish Date - May 03 , 2024 | 05:02 PM
అమేథీ నుంచి రాయబరేలికి రాహుల్ గాంధీ పారిపోయారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ కొట్టివేసింది. చెస్, రాజకీయాల్లో నిష్ణాతుడైన ఆటగాడుగా రాయబేరిలి నుంచి పోటీ చేయాలని రాహుల్ తీసుకున్న నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ జైరామ్ రమేష్ చెప్పారు.
న్యూఢిల్లీ: అమేథీ నుంచి రాయబరేలికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) పారిపోయారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ (Congress) పార్టీ కొట్టివేసింది. చెస్ (Chess), రాజకీయాల్లో (politics) నిష్ణాతుడైన ఆటగాడుగా రాయబేరిలి నుంచి పోటీ చేయాలని రాహుల్ తీసుకున్న నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ జైరామ్ రమేష్ చెప్పారు.
''ఆయన రాజకీయాలు, చెస్‌లో అనుభవజ్ఞుడైన ఆటగాడైన విషయం గుర్తుంచుకోండి. విస్తృత సంప్రదింపుల అనంతరం పార్టీ విస్తృత వ్యూహంలో భాగంగా ఒక నిర్ణయం తీసుకుంది'' అని జైరామ్ రమేష్ తెలిపారు. రాయబరేలి నియోజకవర్గానికి ఇందిరాగాంధీ, సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించారని, అదేమీ వారసత్వం కాదని, అది బాధ్యత అని, విద్యుక్త ధర్మమని జైరామ్ రమేష్ తెలిపారు. గాంధీ కుటుంబం విషయానికి వస్తే అమేథీ-రాయబరేలికి మాత్రమే ఆ కుటుంబానికి పరిమితం కాదన్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ యావద్దేశంపై గాంధీ కుటుంబానికి గట్టి పట్టు ఉందని చెప్పారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి మూడు సార్లు, కేరళ నుంచి ఒకసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారనీ, వింద్యాస్ (Vindhyas) దిగువన సింగిల్ సీటు నుంచి పోటీకి ప్రధానమంత్రి ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల సుదీర్ఘ పోరాటంలో మరిన్ని పావులు కూడా కదపునున్నట్టు కాంగ్రెస్ పార్టీ సంకేతాలిచ్చింది.
Lok sabha Elections 2024: భయపడొద్దు, పారిపోవద్దు.. రాహుల్ నామినేషన్‌పై మోదీ
దీనికి ముందు రాహుల్ గాంధీ రాయబరేలి అభ్యర్థిత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఓటమి భయంతో పోటీకి దూరంగా ఉండబోతున్నారని పార్లమెంటులో ఆనాడే చెప్పానని అన్నారు. అమేథీ నుంచి పోటీకి బయటకి రాయబరేలికి రాహుల్ పారిపోతున్నాడని కూడా చెప్పానని అన్నారు. అందరినీ భయపడద్దని చెప్పే ఆ పార్టీకి ఇప్పుడు తాను భయపడొద్దు...పారిపోవద్దు...అని చెప్పదలచుకున్నానని వ్యాఖ్యానించారు. అమేథీ నియోజకవర్గం బీబేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సైతం రాహుల్ రాయబేరిలి నుంచి పోటీకి దిగడంపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. రాయబరేలి నుంచి రాహుల్ ఎన్నికల బరిలోకి దిగడం అమేథీ ప్రజల విజయమని అన్నారు. అమేథీలో ఆయనకు ఓటమి తప్పదని కాంగ్రెస్ పార్టీ ముందే ఒప్పుకున్నట్టు అయిందని చెప్పారు.
Read Latest National News and Telugu News
Updated Date - May 03 , 2024 | 05:20 PM