ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Air India Flight: విమానంలో షాకింగ్ సీన్.. ఎయిర్ హోస్టెస్ బాత్రూంలోకి వెళ్లి చూస్తే..

ABN, Publish Date - May 16 , 2024 | 01:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో బుధవారం ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆ విమానం టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న సమయంలో.. ఓ ఊహించని పరిణామం కారణంగా పెద్ద అలజడి..

ఎయిర్ ఇండియా (Air India) విమానంలో బుధవారం ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆ విమానం టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న సమయంలో.. ఓ ఊహించని పరిణామం కారణంగా పెద్ద అలజడి రేగింది. అందులోని ప్రయాణికులందరూ ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. చివరికి తనిఖీలు నిర్వహించాక ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే..


Amit Shah: పీవోకేని భారత్‌లో కలుపుతాం!

బుధవారం 7:30 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం ఢిల్లీ (Delhi) నుంచి వడోదరాకు (Vadodara) బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ప్రయాణికులందరూ ఎక్కేసిన తర్వాత టేకాఫ్‌కి రెడీ అవుతున్నప్పుడు.. ఓ ఎయిర్ హోస్టెస్ (Air Hostess) బాత్రూంలోకి వెళ్లింది. లోపలికి వెళ్లిన తర్వాత ఆమెకు ఒక నోట్ కనిపించింది. అది తెరిచి చూడగా.. దానిపై ‘బాంబ్’ అని రాసి ఉంది. దీంతో ఆమె వెంటనే బయటకు వచ్చి, ఈ విషయాన్ని కెప్టెన్‌కు తెలియజేసింది. ఇంతలో ఈ మేటర్ ప్రయాణికులకు కూడా తెలియడంతో.. వాళ్లు భయాందోళనలకు గురయ్యారు. అప్పుడు కెప్టెన్ అలర్ట్ అయ్యి.. ప్రయాణికుల్ని దించేసి, ఈ సమాచారాన్ని పై అధికారులకు తెలియజేశాడు.

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది.. ఇక ఎన్నికల కోడ్ ముగిసినట్లేనా?

పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ రంగంలోకి దిగి.. విమానంలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తొలుత ఆ నోట దొరికిన బాత్రూంలో బాగా వెతికారు. ఆపై విమానం మొత్తం పరిశీలించారు. చివరికి ఏదీ అనుమానాస్పదంగా దొరక్కపోవడంతో.. ఇదొక ఫేక్ బెదిరింపు అని తేల్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఆ నోట్ బాత్రూంలోకి ఎలా వచ్చింది? దాన్ని ఎవరు అక్కడ పెట్టారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విమానం ఎక్కిన ప్రయాణికుల్లోనే ఎవరో ఒకరు ఆ పని చేసి ఉంటారా? లేకపోతే ఇతరుల హస్తం ఉందా? అనే తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు.. ప్రయాణికుల్ని మరో విమానం ఎక్కించి పంపించేశారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 16 , 2024 | 01:07 PM

Advertising
Advertising