ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Guwahati: కాంగ్రెస్‌ ఫేక్‌ ప్రచారం బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంటూ తప్పుడు విమర్శలు.

ABN, Publish Date - May 01 , 2024 | 04:34 AM

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తారని కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

  • మత ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లకే మేం వ్యతిరేకం

  • రాజ్యాంగాన్ని మారుస్తారనేది కూడా తప్పుడు ప్రచారమే: షా

  • తాను మాట్లాడిన అసలు వీడియో.. ఫేక్‌ వీడియో ప్రదర్శన

  • ఫేక్‌ ప్రచారంలో బీజేపీ దిట్ట... ఖర్గే ఎదురుదాడి

మత ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లకే మేం వ్యతిరేకం: అమిత్‌ షా

గువాహటి, ఏప్రిల్‌ 30: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తారని కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. రిజర్వేషన్లపై తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఒక ఫేక్‌ వీడియోను ప్రచారంలోకి తెచ్చిందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లపై తాను మాట్లాడిన అసలు వీడియో... కాంగ్రెస్‌ ప్రచారంలో పెట్టిందని చెబుతున్న ఫేక్‌ వీడియోను షా విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు.


ఉమ్మడి ఏపీలో ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన 4ురిజర్వేషన్లతో ఓబీసీలు నష్టపోయారని, ఓ సర్వే కూడా చేపట్టకుండానే కర్ణాటకలో ముస్లిందరినీ ఓబీసీ కేటగిరిలోకి చేర్చారని కాంగ్రెస్‌ పై షా ధ్వజమెత్తారు. ఇలా మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లను ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక తొలగిస్తుందని ఆయన తెలిపారు. 400 సీట్లతో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తీసివేస్తుందంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా ఆధారరహితమని షా స్పష్టం చేశారు.


కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు రాహుల్‌ గాంధీ చేపట్టిన తర్వాత రాజకీయాలను మరింతగా దిగజార్చారని షా విమర్శించారు. కర్ణాటకలో జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రెవణ్ణకు సంబంధించిన సెక్స్‌ స్కాంపై ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. షా విమర్శలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. ఫేక్‌ వీడియోలు చేయడంలో, సోషల్‌ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడంలో బీజేపీకి ఎంతో అనుభవం ఉందని కాంగ్రెస్‌ చీఫ్‌ అన్నారు.


కాగా, బీజేపీని ఎదుర్కోవడం చేతగాని ప్రతిపక్షాలు సోషల్‌ మీడియాలో నకిలీ వీడియోలను సర్క్యులేట్‌ చేస్తున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. ‘‘ఏఐతో నకిలీ వీడియోలు తయారు చేసి వారి ప్రేమ దుకాణంలో అమ్ముతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఆ అబద్ధాల దుకాణాన్ని ఇక మూతవేయాలి... అని పిలుపునిచ్చారు.

Updated Date - May 01 , 2024 | 04:34 AM

Advertising
Advertising