ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kangana Ranaut: కంగానాకు చెంప దెబ్బ.. కానిస్టేబుల్‌కి మద్దతుగా రైతు సంఘాలు ఏం చేస్తున్నాయంటే?

ABN, Publish Date - Jun 08 , 2024 | 06:38 AM

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను(Kangana Ranaut) చండీగఢ్ విమానాశ్రయంలో చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్(CISF) మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్‌కు రైతు సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ కేసులో కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

ఢిల్లీ: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను(Kangana Ranaut) చండీగఢ్ విమానాశ్రయంలో చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్(CISF) మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్‌కు రైతు సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ కేసులో కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆమెకు అన్యాయం జరగక్కూడదని డిమాండ్ చేస్తూ ఈ నెల 8, 9 తేదీల్లో మొహాలీలో న్యాయ యాత్ర నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు వెల్లడించాయి.

ఈ మేరకు శుక్రవారం చండీగఢ్ సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్, కిసాన్ మజ్జూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ సర్వణ్ సింగ్ పందేర్ ఓ ప్రకటన విడుదల చేశారు. "ఘటన జరగడానికి గల మొత్తం పరిణామాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కుల్వీందర్‌కు అన్యాయం జరగక్కూడదు" అని కోరుతూ వారు పంజాబ్ డీజీపీ గౌరవ్‌ని కలిశారు. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్‌ను అధికారులు సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. కుల్వీందర్ కౌర్‌కు సింగర్ విశాల్ దర్గానీ మద్దతు ప్రకటించారు.


వివాదం ఇదే..

చండీగఢ్‌ విమానాశ్రయంలో కంగనా రనౌత్‌ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ చెంప దెబ్బ కొట్టింది. దీంతో ఆమెను శుక్రవారం అరెస్టు చేశారు. ఇప్పటికే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయగా.. విధుల నుంచి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. సాగు చట్టాలను వ్యతిరేకించిన రైతులపై గతంలో కంగన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆమెపై చేయు చేసుకున్నట్లు కుల్విందర్‌ కౌర్‌ వెల్లడించారు. రైతు సంఘాల నాయకులు కుల్విందర్‌ కౌర్‌కు పలు రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి.

For Latest News and National News click here

Updated Date - Jun 08 , 2024 | 06:38 AM

Advertising
Advertising