Farooq Abdullah: మమ్మల్ని ఎన్నుకుంటే మళ్లీ 'దర్బార్ మూవ్'
ABN, Publish Date - Sep 20 , 2024 | 04:16 PM
జమ్ము, కశ్మీర్‌ను రాజకీయంగా, ఆర్థికంగా, భావోద్వేగాల పరంగా అనుసంధానించే వారధి 'దర్బార్ మూవ్' అని ఫరూక్ అబ్దుల్లా గుర్తు చేశారు. ఇందువల్ల రెండు ప్రాంతాల మధ్య ఎలాంటి విభజన ఉండదని, అది ఎంతమాత్రం సరికాదని ఆయన అన్నారు.
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో (Jammu and Kashmir Assembly Elections) తమను అధికారంలోకి తీసుకు వస్తే చారిత్రక 'దర్బార్ మూవ్' (Darbar)ను పునరుద్ధరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) హామీ ఇచ్చారు. జమ్మూ, కశ్మీర్ మధ్య ఐక్యతను పాదుకొలిపేందుకు ఈ చర్య దోహదపడుతుందని చెప్పారు. జమ్ము, కశ్మీర్‌ను రాజకీయంగా, ఆర్థికంగా, భావోద్వేగాల పరంగా అనుసంధానించే వారధి 'దర్బార్ మూవ్' అని గుర్తు చేశారు. ఇందువల్ల రెండు ప్రాంతాల మధ్య ఎలాంటి విభజన ఉండదని, అది ఎంతమాత్రం సరికాదని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దశాబ్దాలుగా అనుసరిస్తున్న 'దర్బార్ మూవ్' ప్రక్రియను పునరుద్ధరిస్తామని వాగ్దానం చేశారు.
ఏమిటీ దర్బార్ మూవ్?
దీనికి 152 ఏళ్ల చరిత్ర ఉంది. మహారాజా రణ్‌బీర్ సింగ్ పాలనలో 1872లో ఈ దర్బార్ మూవ్‌ను ప్రారంభించారు. ఆ ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమ్మర్ రాజధాని శ్రీనగర్‌కు షిఫ్ట్ అవుతాయి. ఆ తర్వాత ఆరు నెలలు వింటర్ క్యాపిటల్ జమ్మూకు షిఫ్ట్ అవుతాయి. మే నుంచి అక్టోబర్ వరకూ సమ్మర్ సీజన్‌లో ప్రభుత్వ అధికారులు, యంత్రాగం అంతా శ్రీనగర్ నుంచి పనిచేస్తారు. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకూ వింటర్‌లో జమ్ము నుంచి పనిచేస్తుంటారు. రెండు ప్రాంతాల (జమ్ము, కశ్మీర్) మధ్య సమదృష్టితో వ్యవహరించడం ఈ చర్య ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఇది దోహదం చేసేధనే అభిప్రాయం బలంగా ఉంది.
Land For Job Scam: జాబ్స్ స్కాం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో షాక్.. మళ్లీ జైలుకు తప్పదా
వివాదం, సస్పెన్షన్
నిజానికి దర్బార్ మూవ్ విషయంపై ఎలాంటి వివాదం లేనప్పటికీ ఈ చర్య వల్ల రాష్ట్ర ఖజానాకు భారం ఎక్కువవుతోందనే వాదన మాత్రం ఉంది. ప్రభుత్వ ఆఫీసులు, రికార్డులు, సిబ్బందిని తరలించడం వల్ల ఏటా వందల కోట్లు ఖర్చవుతోందని పలువురి వాదన. కోవిడ్ మహమ్మారి సమయంలో ఖర్చు విషయంలో ఈ ఆందోళనలు మరింత పెరగడంతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ విధానాన్ని 2021 జూన్ 30న సస్పెండ్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ అంశం ఈ ప్రాంతంలో రాజకీయంగా, సాంస్కృతిక పరంగా కీలకాంశంగానే కొనసాగుతోంది. సమ్మిళత వృద్ధి, ప్రాంతీయ సామరస్యతకు ఈ చర్య కీలకమనే అభిప్రాయం బలంగానే ఉంది.
Read MoreNational News and Latest Telugu News
Also Read: CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌కు వరద పోటు.. జార్ఖండ్ సరిహద్దు మూసివేత
Updated Date - Sep 20 , 2024 | 04:17 PM