Bangladesh: బంగ్లాదేశ్ మాటలతో వినకపోతే.. ఆర్ఎస్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 11 , 2024 | 05:37 PM
హిందూ కమ్యూనిటీని కూకటి వేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతోనే బంగ్లాలో హింస జరుగుతోందని సునీల్ అంబేకర్ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో మాత్రమే కాదు, పాకిస్థాన్‌లోనూ హిందువులపై దాడులు జరుగుతున్నాయని, హిందువులపై దాడులను మనం ఎంతమాత్రం సహించరాదని సూచించారు.
నాగపూర్: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై కొనసాగుతున్న దాడులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) నేత సునీల్ అంబేకర్ (Sunil Ambekar) కీలక వ్యాఖ్యలు చేశారు. సంప్రదింపులతో హింసాకాండ ఆగకపోతే మరో పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని కేంద్రానికి ఆయన సూచించారు. బంగ్లాలో మైనారిటీలపై దాడులను ఖండిస్తూ సకల హిందూ సమాజ్ ఆధ్వర్యంలో నాగపూర్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో అంబేకర్ పాల్గొని ప్రసంగించారు.
Rahul Gandhi: రాజ్‌నాథ్‌కు రాహుల్ వినూత్న గిఫ్ట్
''కేంద్రం గట్టి ప్రయత్నం చేయాలి, మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. చర్చలతో సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాను. చర్చలు విఫలమైతే మాత్రం మరో మార్గాన్ని అన్వేషించాలి. మన ఆలయాలు తగులబెడుతున్నారు, లూటీ చేస్తున్నారు, మహిళలను చిత్రహింసలు పెడుతున్నారు. అసలేం జరుగుతోందంటూ ప్రతి హిందువు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి ఘటనలను కేవలం ఖండించడం, మనస్తాపం చెందడంతో సరిపోదు. వీటికి అతీతంగా ఏం చేయాలనేది ఆలోచించి ముందుకు వెళ్లాలి'' అని అంబేకర్ సూచించారు.
హిందూ కమ్యూనిటీని కూకటి వేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతోనే బంగ్లాలో హింస జరుగుతోందని అంబేకర్ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో మాత్రమే కాదు, పాకిస్థాన్‌లోనూ హిందువులపై దాడులు జరుగుతున్నాయని, హిందువులపై దాడులను మనం ఎంతమాత్రం సహించరాదని సూచించారు. మనం అచేతనంగా ఉండిపోతే మన మౌనాన్ని భవిష్యత్ తరాలు ప్రశ్నిస్తాయని హెచ్చరించారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తి (మహ్మద్ యూనస్) నడుపుతున్న దేశంలోనే (బంగ్లాదేశ్)లోనే శాంతి లేదన్నారు. మైనారిటీలపై అకృత్యాలను అడ్డుకునేందుకు ఆయన చేస్తున్నదేమీ లేదని తప్పుపట్టారు. బంగ్లాదేశ్‌లో అలజడలు సృష్టిస్తున్న విదేశీ శక్తులను గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ విదేశీ శక్తుల గుట్టు బయటపెట్టి, దేశ విదేశాల్లో ఎక్కడా హిందువులపై దాడులు జరక్కుండా అడ్డుకట్టు వేయాలని సూచించారు. హిందువులపై జరుగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా ప్రపంచదేశాల మద్దతును కూడగట్టాలని కేంద్రానికి సంఘ్ ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో అంబేకర్ తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Parliament: పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..
CM Stalin: అదానీతో భేటీ అవాస్తవం.. ఆ గ్రూపుతో ఒప్పందాల్లేవ్..
For National news And Telugu News
Updated Date - Dec 11 , 2024 | 05:37 PM