MUDA Scam: వెంటాడుతున్న ముడా స్కామ్.. సీఎంపై కేసు నమోదు
ABN, Publish Date - Sep 27 , 2024 | 07:07 PM
ముఖ్యమంత్రి భార్య పార్వతికి రూ.56 కోట్లు విలువజేసే 14 స్థలాలను మైసూర్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేటాయించిందని, ఇందువల్ల సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందిందని సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహం కొద్దికాలం క్రితం గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్‌కు ఫిర్యాదు చేశారు.
బెంగళూరు: మైసూర్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)పై లోకాయుక్త (Lokayukta) పోలీసులు శుక్రవారంనాడు కేసు నమోదు చేసింది. సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య బీఎం పార్వతి, తదితరులను నిందితుల జాబితాలో చేర్చారు. లోకాయుక్త ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం రెండ్రోజుల క్రితం అనుమతించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తు నివేదికను డిసెంబర్ 24వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా ప్రత్యేక న్యాయస్థానం లోకాయుక్త పోలీసులను ఆదేశించింది.
ముఖ్యమంత్రి భార్య పార్వతికి రూ.56 కోట్లు విలువజేసే 14 స్థలాలను మైసూర్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేటాయించిందని, ఇందువల్ల సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందిందని సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహం కొద్దికాలం క్రితం గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీఎంను విచారించాలంటూ గవర్నర్ ఆదేశించడంతో ఆయన ఆదేశాలను కర్ణాటక హైకోర్టులో సిద్ధరామయ్య సవాలు చేశారు. అయితే గవర్నర్ ఆదేశాలను హైకోర్టు సమర్ధించింది. సమగ్ర దర్యాప్తులో భాగంగా సీఎంను విచారణకు గవర్నర్ ఆదేశించడం చట్టబద్ధమేనని పేర్కొంది. ఈ క్రమంలోనే లోకాయుక్త పోలీసులతో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం సైతం రెండ్రోజుల క్రితం అనుమతించింది. దీంతో లోకాయుక్త పోలీసులు సీఎంపై కేసు నమోదు చేశారు.
Muda Scam: సీబీఐపై నిషేధం.. ఈడీ ఎంటర్ అవుతుందా..
రాజీనామా ప్రసక్తే లేదు..
కాగా, తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి స్పందించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేది లేదన్నారు. తానెలాంటి తప్పూ చేయలేదని, రాజకీయపరంగా తనపై కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారి, ఇది కేవలం రాజకీయపరమైన కేసేనని స్పష్టంచేశారు. తప్పు చేసినవాళ్లు రాజీనామా చేయాలే కానీ, తాను ఎలాంటి తప్పూ చేయనపుడు రాజీనామా ప్రసక్తే ఉండదన్నారు.
Read More National News and Latest Telugu News
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Sep 27 , 2024 | 07:07 PM