ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chhattisgarh: హోరాహోరీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు నక్సల్స్ కాల్చివేత

ABN, Publish Date - Nov 16 , 2024 | 02:36 PM

నక్సల్స్‌కు గట్టిపట్టున్న దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంయుక్త భద్రతా బలగాలు గాలింపు జరుపుతుండగా ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. ఇది చాలా కీలకమైన ఆపరేషన్ అని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)‌లోని బస్తర్‌ (Bastar)లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కాంకెర్- నారాయణపూర్ సరిహద్దునున్న అబూజమర్హ్ అడవుల్లో నక్సల్స్‌కు, భద్రతా బలగాలకు మధ్య శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ను బలగాలు మట్టుబెట్టాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి నుంచి బలగాల గాలింపు చర్యలు జరుపుతుండగా ఉదయం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

Fire Accident: మెడికల్ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారులు మృతి


నక్సల్స్‌కు గట్టిపట్టున్న దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంయుక్త భద్రతా బలగాలు గాలింపు జరుపుతుండగా ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. ఇది చాలా కీలకమైన ఆపరేషన్ అని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గాయపడిన జవాన్లను వైద్యచికిత్స కోసం హెలికాఫ్టర్‌లో తరలించామని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకబడగా ఉందని చెప్పారు.


కాగా, ఈవారం మొదట్లో భద్రతా బలగాలు కీలకమైన ఆపరేషన్ జరిపారు. బిజాపూర్ జిల్లాలో చేపట్టిన గాలింపు చర్యల్లో సీనియర్ ప్లాటూన్ కమాండర్ సహా ముగ్గురు నక్సల్స్‌ను బలగాలు మట్టుబెట్టాయి. సీనియర్ ప్లాటూన్ కమాండర్ తలపై రూ.8 లక్షల రివార్డు కూడా ఉంది. డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎలైట్ కోబ్రా యూనిట్‌ కలిసికట్టుగా రేఖాపల్లి-కోమత్ పల్లి అడవుల్లో ఈ అపరేషన్ జరిపారు. మూడు మృతదేహాలు, భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, ఈ ఆపరేషన్‌తో నక్సల్స్ కార్యకలాపాలకు తీవ్రమైన దెబ్బ తగిలిదంని బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్ రాజ్ పి తెలిపారు. బస్తర్‌ ఏరియాలో నక్సల్స్‌ను పూర్తిగా ఏరివేయాలనే లక్ష్యంతో భద్రతా బలాలు అత్యంత అప్రమత్తంగా గాలింపు చర్యలు చేపడుతుండగా, రాబోయే రోజుల్లో అదనపు బలగాలు కూడా వచ్చిచేరనున్నట్టు అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

TVK: టీవీకేలో కోటికి చేరిన సభ్యత్వాలు

Viral News: ఘోరంగా మోసపోయిన స్టార్ హీరోయిన్ తండ్రి..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 16 , 2024 | 02:36 PM