Delhi: కాంగ్రెస్‌కు షాక్.. ఐదుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆప్‌లో చేరిక
ABN, Publish Date - Nov 10 , 2024 | 05:26 PM
అహ్మద్ భార్య, కుమారుడు కూడా ఇటీవల ఆప్‌లో చేరారు. అక్టోబర్ 29న అహ్మద్ కుమారుడు చౌదరి జుబీర్ అహ్మద్, ఆయన కౌన్సిలర్ భార్య షాగుఫ్తా చౌదరి ఆప్‌లో చేరారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అహ్మద్ కుటుంబం పార్టీ మారడం కాంగ్రెస్‌కు మింగుడపడటం లేదని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తు్న్న కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత చౌదరి మతీన్ అహ్మద్ (Chaudhary Mateen Ahmad) పార్టీ మారారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో ఆదివారంనాడు చేరారు. కేజ్రీవాల్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. 1993 నుంచి 2013 వరకూ ఐదు సార్లు ఆయన సీలాంపూర్ అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
Amit shah: మహారాష్ట్ర తదుపరి సీఎం షిండే కాదా?.. అమిత్‌షా ఏమన్నారంటే
అహ్మద్ భార్య, కుమారుడు కూడా ఇటీవల ఆప్‌లో చేరారు. అక్టోబర్ 29న అహ్మద్ కుమారుడు చౌదరి జుబీర్ అహ్మద్, ఆయన కౌన్సిలర్ భార్య షాగుఫ్తా చౌదరి ఆప్‌లో చేరారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అహ్మద్ కుటుంబం పార్టీ మారడం కాంగ్రెస్‌కు మింగుడపడటం లేదని తెలుస్తోంది.
ఆప్‍లోనూ కుదుపు
కాగా, ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి సైతం ఆ పార్టీ వెటరన్ నేత హర్షరణ్ సింగ్ బల్లి షాక్ ఇచ్చారు. ఆయన ఆదివారంనాడు పార్టీని వీడి తన కుమారుడు గుర్మీత్ సింగ్‌తో కలిసి బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. వెస్ట్ ఢిల్లీలోని హరినగర్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా హర్షరణ్ గెలిచారు. మదన్‌లా ఖురానా ప్రభుత్వం మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆప్‌లో చేరారు.
ప్రముఖ నటుడు కన్నుమూత.. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
యడియూరప్ప, శ్రీరాములుపై న్యాయ విచారణ!
For More National And Telugu News
Updated Date - Nov 10 , 2024 | 05:30 PM