ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Former CM: ప్రజలే తీర్పిస్తారు.. ఎవరు అధికారంలో ఉండాలో వారే నిర్ణయిస్తారు

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:23 AM

ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలని కలలు కనడం సహజమేనని అయితే, ఈ నిర్ణయం ప్రజల చేతుల్లో మాత్రమే ఉందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) అభిప్రాయపడ్డారు.

- సేలంలో ఈపీఎస్‌

చెన్నై: ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలని కలలు కనడం సహజమేనని అయితే, ఈ నిర్ణయం ప్రజల చేతుల్లో మాత్రమే ఉందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) అభిప్రాయపడ్డారు. సేలంలోని కొంగనాపురంలో మంగళవారం సేలం జిల్లా పార్టీ నిర్వాహకుల సమావేశంలో పళనిస్వామి పాల్గొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని మెజార్టీ స్థానాల్లో గెలిపించేలా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఈపీఎస్‌ సమాధానం చెప్పారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: బంగాళాఖాతంలో తుఫాన్‌.. 5 రోజుల వర్షసూచన


డీఎంకే మంత్రిపై రూ.400 కోట్ల అవినీతి ఫిర్యాదు వెలుగుచూసిందని మీడియా ద్వారా తెలుసుకున్నానని, దీనిపై పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడడం సరికాదన్నారు. డీఎంకే పాలనలో దాదాపు అన్ని శాఖల్లో మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని, ఈ వివరాలు త్వరలోనే ప్రజల ముందు ఉంచుతానన్నారు. సినీనటుడు విజయ్‌ ప్రారంభించిన తమిళగ వెట్రి కళటం తొలి రాష్ట్రస్థాయి మహానాడు విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా పలు సమస్యలపై 36,000 పోరాటాలు నిర్వహించేందుకు అనుమతించామని అయితే, ప్రస్తుత పాలనలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.


మాదకద్రవ్యాల మత్తులో రాష్ట్రం..

పోలీసుశాఖకు పూర్తి స్వేచ్ఛ లేనందున రాష్ట్రం మాదకద్రవ్యాల మత్తులో తూగుతోందని ఈపీఎస్‌ విమర్శించారు. ఆ మేరకు ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు. నగరంలో ఈ నెల 19వ తేదీ సీఎం అధ్యక్షతన జరిగిన శాంతిభద్రతల పరిరక్షణా సమావేశంలో గంజాయి ఉత్పత్తిని పూర్తిగా నివారించినట్లు చెప్పడం వాస్తవం కాదన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల డీజీపీల వద్ద ఆయా రాష్ట్రాల నుంచి తమిళనాడుకు చట్టవిరుద్ధంగా తరలించే గంజాయి, మాదకద్రవ్యాలను అడ్డుకోవాలని కోరలేదన్నారు. కొకైన్‌, డ్రగ్స్‌ మాత్రలు తదితర మాదకద్రవ్యాలు రాష్ట్రం మీదుగా విదేశాలకు స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు.


ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ఇదికూడా చదవండి: KTR : రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు!

ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ఇదికూడా చదవండి: BRS Leaders : కేటీఆర్‌, హరీశ్‌రావుకు ప్రాణహని!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 23 , 2024 | 11:23 AM