ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అధికారిక భవనం ఖాళీ చేస్తూ ఫర్నీచర్‌ ఎత్తుకెళ్లారు

ABN, Publish Date - Oct 08 , 2024 | 04:05 AM

రాష్ట్రీయ జనతాదళ్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ తన అధికార భవనాన్ని ఖాళీ చేస్తూ అందులోని విలువైన ఫర్నీచర్‌ అంతా ఎత్తుకుపోయారని బీజేపీ ఆరోపించింది.

  • తేజస్వీయాదవ్‌పై బీజేపీ ఆరోపణ

పాట్నా, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రీయ జనతాదళ్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ తన అధికార భవనాన్ని ఖాళీ చేస్తూ అందులోని విలువైన ఫర్నీచర్‌ అంతా ఎత్తుకుపోయారని బీజేపీ ఆరోపించింది. సోఫాలు, ఏసీలు, హైడ్రాలిక్‌ పరుపులు, వాష్‌ బేసిన్లు, నల్లాలు, లైట్లు, బ్యాడ్మింటన్‌ కోర్ట్‌ మ్యాట్‌, కంప్యూటర్‌, ఫ్రిడ్జ్‌ తదితర వస్తువులన్నీ దొంగతనం అయ్యాయని బీజేపీ మీడియా ఇంఛార్జ్‌ డానిష్‌ ఇక్బాల్‌ ఆరోపించారు.

విజయదశమిలోగా ఇదే భవనంలోకి రావాలని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌధరి నిర్ణయించుకోవడంతో తేజస్వీ యాదవ్‌ తన అధికార భవనాన్ని ఖాళీ చేసిన సందర్భంగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై ఆర్జేడీ తీవ్రంగా స్పందించింది. కనిపించకుండా పోయిన సామాగ్రి జాబితాను భవన నిర్మాణ విభాగం ద్వారా విడుదల చేయాలని సూచించింది. లేనిపక్షంలో క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది.

Updated Date - Oct 08 , 2024 | 04:05 AM