Forensic Lab : ఆ శృంగార వీడియోలు వాస్తవమే
ABN, Publish Date - Aug 03 , 2024 | 03:51 AM
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు వచ్చిన శృంగార వీడియోలు వాస్తవమైనవేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది...
ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక
బెంగళూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు వచ్చిన శృంగార వీడియోలు వాస్తవమైనవేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఒరిజినల్ అని ఎఫ్‌ఎ్‌సఎల్ అందులో పేర్కొంది. సోషల్ మీడియాలో ప్రచారమైన ఫొటోలు, వీడియోలు ఎడిట్ లేదా మార్ఫింగ్ జరగలేదని నిర్ధారించింది.
ఎలాంటి యానిమేషన్, గ్రాఫిక్స్ ఉపయోగించలేదని ఎఫ్‌ఎ్‌సఎల్ నివేదికలో స్పష్టం చేసింది. దీంతో విచారణ మరింత లోతుగా జరిపేందుకు సిట్‌కు అవకాశం లభించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో మహిళలు మాత్రమే కనిపించారు. అందులో ఎక్కడా పురుషుడి ముఖం కనిపించలేదు. ప్రస్తుతానికి అశ్లీల వీడియోల్లో ఉన్నది ప్రజ్వల్ అవునా కాదా అనేది తేలాల్సి ఉంది. వీడియోలు మాత్రం వాస్తవమైనవని ప్రాథమిక నివేదిక ద్వారా స్పష్టమైంది.
Updated Date - Aug 03 , 2024 | 08:10 AM