SM Krishna: మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స..
ABN, Publish Date - May 12 , 2024 | 11:12 AM
స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కర్ణాటకకు చెందిన మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ(SM Krishna) తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో ఏప్రిల్ 30న మణిపాల్ ఆసుపత్రిలో చేరారు.
బెంగళూరు (కర్ణాటక): స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కర్ణాటకకు చెందిన మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ(SM Krishna) తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో ఏప్రిల్ 30న మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు ఆయన్ని ఐసీయూలోకి తరలించారు.
వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం నిఘా ఉంచారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్... కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కృష్ణ.. యూపీఏ హయాంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పని చేశారు. ఆయన 1999 అక్టోబర్ 11 నుంచి 2004 మే 28 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.
Indians: అమెరికాలో విషాదం.. నీటిలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
2009 నుంచి 2012 వరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు. కాంగ్రెస్‌తో దాదాపు 50 ఏళ్ల అనుబంధాన్ని ముగించుకుని 2017 మార్చిలో బీజేపీలో చేరారు. గతేడాది క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
Read Latest News and National News here..
Updated Date - May 12 , 2024 | 11:33 AM