ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Former Minister: ఎన్ని జన్మలెత్తినా మా పార్టీని నాశనం చేయలేరు..

ABN, Publish Date - Aug 28 , 2024 | 12:06 PM

కోట్లాదిమంది ప్రజలు, కార్యకర్తల ఆదరాభిమానాలున్న అన్నాడీఎంకే(AIADMK)ను నాశనం చేస్తామంటూ శపథాలు చేసినవారంతా అడ్రస్‌ లేకుండా పోయారని, ఈ విషయం తెలిసినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తమ పార్టీ నేతపై అదే పనిగా విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి డి. జయకుమార్‌(Former Minister D. Jayakumar) ఆగ్రహం వ్యక్తం చేశారు.

- అన్నామలైపై మాజీ మంత్రి జయకుమార్‌ ధ్వజం

చెన్నై: కోట్లాదిమంది ప్రజలు, కార్యకర్తల ఆదరాభిమానాలున్న అన్నాడీఎంకే(AIADMK)ను నాశనం చేస్తామంటూ శపథాలు చేసినవారంతా అడ్రస్‌ లేకుండా పోయారని, ఈ విషయం తెలిసినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తమ పార్టీ నేతపై అదే పనిగా విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి డి. జయకుమార్‌(Former Minister D. Jayakumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో బుధవారం ఉదయం మీడియా సమావేశంలో అన్నామలైపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇదికూడా చదవండి: Modi Cabinet: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో కీలక పరిణామం


అన్నాడీఎంకేని తాకి చూడండి ఆ తర్వాత ఏమవుతారో తెలుస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నామలై, ఆయన తాతముత్తాతలు తలచుకున్నా అన్నాడీఎంకేని ఏమీ చేయలేరని, తాకితే నాశనం కావటం ఖాయమన్నారు. అన్నామలైని రాష్ట్ర ప్రజలంతా ఫ్యూజ్‌ పోయిన బల్బుగానే భావిస్తున్నారని విమర్శించారు. రెండు కోట్ల మంది కార్యకర్తలు కలిగిన పార్టీకి చెందిన ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) అమెరికాకు, అన్నామలై లండన్‌కు ఇంచుమించూ ఒకే సమయంలో వెళ్తున్నారని, వీరిద్దరూ విదేశాలకు వెళ్ళి రహస్యంగా మంతనాలు జరుపబోతున్నారని జయకుమార్‌ ఆరోపించారు.


వణుకుతున్న అన్నాడీఎంకే...

అన్నామలైని చూసి అన్నాడీఎంకే నేతలంతా వణకిపోతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్‌(BJP State Vice President Karu Nagarajan) విమర్శించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన అన్నామలై రాజకీయ ప్రవేశం చేయగానే ముందుగా అన్నాడీఎంకేకు భయంపట్టుకుందని తెలిపారు. ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami)ని అన్నాడీఎంకేలో పలుకుబడి కలిగిన నేతగా రాష్ట్ర ప్రజలు అంగీకరించడమే లేదన్నారు. ఇకనైనా అన్నాడీఎంకే నేతలు అన్నామలైని విమర్శించటం మానుకోవాలని ఆయన హితవుపలికారు.


..........................................................

ఈ వార్తను కూడా చదవండి:

..........................................................

Airport: ఎయిర్‌పోర్ట్‌లో ఒకే సమయంలో రెండు రన్‌వేలపై ల్యాండింగ్‌..

- 10 శాతం విమానసేవల పెంపు

చెన్నై: స్థానిక మీనాంబాక్కం విమానాశ్రయం(Meenambakkam Airport)లో ఇటీవల చేపట్టిన మరమ్మతుల కారణంగా రెండు రన్‌వేలను ఒకే సమయంలో ఉపయోగించడానికి వీలుకావటంతో రెండో రన్‌వేలో నడిపే విమానాల సంఖ్య 10 శాతానికి పెరిగింది. ఈ విమానాశ్రయంలో రెండు రన్‌వేల్లో రోజూ విమానాలు దిగుతుంటాయి. మొదటి రన్‌వే 3.66 కి.మీ.ల పొడవు, రెండో రన్‌వే 2.89 కి.మీ.ల పొడవు ఉన్నాయి. మొదటిది మెయిన్‌ రన్‌వే కాగా, దీనిపై భారీ విమానాలు ల్యాండింగ్‌, టేకాఫ్‌ అవుతుంటాయి.


రెండో రన్‌వేపై 76 సీట్ల కెపాసిటీ కలిగిన విమానాలు, ప్రైవేటు విమానాలు ల్యాండింగ్‌ టేకాఫ్‌ అవుతుంటాయి. ఈ రెండు రన్‌వేల్లో ఒకే సమయంలో విమానాలు దిగటానికి, బయలుదేరటానికి అనువుగా మరమ్మతులు చేపట్టాలని భారత విమానయాన సంస్థ నిర్ణయించింది. ఆ మేరకు ఈ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అయ్యే విమానాలు ఒక రన్‌వే నుంచి మరొక రన్‌వేకు వెళ్లేలా టాక్సీవే అనే అనుబంధ మార్గాలుండేవి. ఈ టాక్సీ వే ‘బి’ అనే బ్రావో మొదటి రన్‌వేకు నేరుగా వెళ్లకుండా వంపు ఉండేది. ఈ కారణంగా ల్యాండింగ్‌ అయ్యే, టేకాఫ్‌ అయ్యే విమానాలు టాక్సీవేలో వేగంగా వెళ్లలేని పరిస్థితులు ఉండేవి.


ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించిన విమానయాన సంస్థ ఉన్నతాధికారులు ఈ టాక్సీవే బి- ని వంపుగా కాకుండా సరళరేఖలా మార్చే పనులు ఇటీవలే ముగిశాయి. దీంతో రెండో రన్‌వేలో విమానా సేవల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరి కొద్ది నెలల్లో మరిన్ని విమానాలు రెండో రన్‌వేలో నడుపనున్నారు. దీంతో విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు మెరుగవుతాయని, కాలయాపనకు తావుండదని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 28 , 2024 | 12:06 PM

Advertising
Advertising
<