ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Former Minister: ఎవరూ అడ్డుకోలేరు.. నేను మళ్లీ బీజేపీలో చేరుతా..

ABN, Publish Date - Apr 24 , 2024 | 12:11 PM

నేను మళ్లీ బీజేపీలో చేరుతా, ఎవరూ అడ్డుకోలేరని శివమొగ్గ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బీజేపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి ఈశ్వరప్ప(Former Minister Eshwarappa) సవాల్‌ విసిరారు. పార్టీ నుంచి సస్పెన్షన్‌ వేటు వేయడంపై ఈశ్వరప్ప స్పందించారు.

- పార్టీని అభివృద్ధి చేసింది నేనే

- తండ్రీ కొడుకులు కుట్ర పన్ని బయటికి పంపారు

- ఎన్నికల్లో గెలిస్తే వారే తీసుకెళ్తారు..

- యడియూరప్పపై ఈశ్వరప్ప ధ్వజం

బెంగళూరు: నేను మళ్లీ బీజేపీలో చేరుతా, ఎవరూ అడ్డుకోలేరని శివమొగ్గ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బీజేపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి ఈశ్వరప్ప(Former Minister Eshwarappa) సవాల్‌ విసిరారు. పార్టీ నుంచి సస్పెన్షన్‌ వేటు వేయడంపై ఈశ్వరప్ప స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రకు అభినందనలు అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా వెనుకడుగు వేస్తారని అందరూ భావించారని, నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక స్పష్టత వచ్చిందన్నారు. యడియూరప్ప, విజయేంద్ర, రాఘవేంద్రలు గందరగోళం చేసేందుకు ప్రయత్నించారని, వారికి సమాధానం లభించిందన్నారు. జగదీశ్‌శెట్టర్‌ బీజేపీని వీడి కాంగ్రెస్‌ లో చేరినప్పుడు కాళ్లు పట్టుకుని మళ్లీ బీజేపీలోకి తీసుకొచ్చానని అదే పరిస్థితి వస్తుందన్నారు. తాత్కాలికంగా నేను పార్టీకి దూరమయ్యానని అయితే ఆరేళ్లవేటు ఉండదన్నారు.

ఇదికూడా చదవండి: Patanjali: ఆ నిబంధన ఎందుకు తొలగించారు.. పతంజలి కేసులో కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు

తండ్రీకొడుకుల కుతంత్రాలతో తాను బీజేపీనుంచి బయటకు వచ్చానన్నారు. బీజేపీ గురించి తెలియని ఓ పసికూన లాంటి రాష్ట్ర అధ్యక్షుడు వేటు వేశారన్నారు. ఇది తాత్కాలికమైన పరిణామమని, తానెప్పుడూ బీజేపీని వీడేది లేదన్నారు. తన జన్మలో కాంగ్రెస్‏లోకి వెళ్లనని, మళ్లీ బీజేపీలోకి వస్తానని ఎవరూ అడ్డుకోలేరన్నారు. తనపై వేటు వేసేందుకు నామినేషన్‌ ఉపసంహరణ గడువు కోసం విజయేంద్ర 3 గంటలపాటు వేచి చూశారన్నారు. ఓడిన శెట్టర్‌ను పార్టీలోకి చేర్చుకున్నారని, నన్ను పిలవరా అంటూ ప్రశ్నించారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన తండ్రే బీజేపీకి తీసుకెళ్తారన్నారు. తాను అభివృద్ధి చేసిన పార్టీ అని, యడియూరప్ప కేజేపీని స్థాపించి మళ్లీ వచ్చినవారని ఆయన డూప్లికేట్‌ అని నేను ఒరిజినల్‌ అన్నారు. కాగా నేహా హత్య విషయంలో సీఎం, సుర్జేవాలాల వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయన్నారు. సోమవారం మరో సంఘటన చోటు చేసుకుందని, ముస్లింలను కాంగ్రెస్‌ వెనకేసుకొస్తోందని, రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ను తరిమికొట్టడమే పరిష్కారమన్నారు.

ఇదికూడా చదవండి: Bird flu: బర్డ్‌ఫ్లూ నిరోధానికి 12 చోట్ల తనిఖీ కేంద్రాలు

Read Latest National News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 12:11 PM

Advertising
Advertising