ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tamilnadu: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఇళంగోవన్ కన్నుమూత

ABN, Publish Date - Dec 14 , 2024 | 05:58 PM

ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇళంగోవన్ గత నెల రోజులుగా అస్వస్థతతో ఉన్నారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో నవంబర్ 11న ఆయన ఆసుపత్రిలో చేరారు.

చెన్నై: కాంగ్రెస్ సీనియర్ నేత, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ (EVKS Elangovan) శనివారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇళంగోవన్ గత నెల రోజులుగా అస్వస్థతతో ఉన్నారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో నవంబర్ 11న ఆయన ఆసుపత్రిలో చేరారు. వైద్యులు మెరుగైన వైద్యచికిత్స అందించినప్పటికీ ఆయన ఉదయం 10.12 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇళంగోవన్ మృతి పట్ల తమిళనాడు కాంగ్రెస్ సంతాపం తెలిపింది. ఆయన మృతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని సంతాప సందేశంలో పేర్కొంది.

Rahul Gandhi: సావర్కర్‌ను అవహేళన చేస్తున్నది మీరు కాదా?: రాజ్యాంగంపై చర్చలో రాహుల్


ప్రఖ్యాత సామాజిక సంస్కర్త ఈవీ రామస్వామి మనుమడు, డీఎంకే వ్యవస్థాపకుడు ఈవీకే సంపత్ కుమారుడైన ఇళంగోవన్ 1980లో కాంగ్రెస్‌లో చేరడంతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994లో గోపిచెట్టిపాలయం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2004లో పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడిగా డీఎంకే, అన్నాడీఎంకే నుంచి ఎదురైన సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారనే పేరు ఆయనకు ఉంది. 2016లో కాంగ్రెస్-డీఎంకే పొత్తును పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 48 సీట్లు గెలుచుకుంది. పి.చిదంబరం 'కాంగ్రెస్ జననాయగ పెరవై' పార్టీని 2004లో కాంగ్రెస్‌లో విలీనం చేయించి ఆయనను పార్టీలోకి తీసుకురావడంలో ఇళంగోవన్ కృషి ఉంది.


ఇవి కూడా చదవండి..

Red Fort: ఎర్రకోట మాది.. తిరిగిచ్చేయండి..

జస్టిస్‌ శేఖర్‌ యాదవ్‌పై అభిశంసన నోటీసు

For National News And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 05:58 PM