School children death: స్కూలు నుంచి వస్తుండగా.. నలుగురు చిన్నారులను కబళించిన మృతువు
ABN, Publish Date - Aug 03 , 2024 | 09:29 PM
మృత్యువు ఏవైపు నుంచి ఎవరిని కబళిస్తోందో ఊహించలేం. మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఇలాంటి హృదయవిదాకర ఘటనే శనివారం చోటుచేసుకుంది. స్కూలు నుంచి వస్తున్న నలుగురు చిన్నారులు ఇంటికి చేరకుండానే మార్గమధ్యంలో ఓ పాడుపడిన ఇంటి గోడ కుప్పకూలడంతో దానికింద పడి కన్నుమూశారు.
రేవా: మృత్యువు ఏవైపు నుంచి ఎవరిని కబళిస్తోందో ఊహించలేం. మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఇలాంటి హృదయవిదాకర ఘటనే శనివారం చోటుచేసుకుంది. స్కూలు నుంచి వస్తున్న నలుగురు చిన్నారులు ఇంటికి చేరకుండానే మార్గమధ్యంలో ఓ పాడుపడిన ఇంటి గోడ కుప్పకూలడంతో దానికింద పడి కన్నుమూశారు.
సంఘటన వివరాల ప్రకారం సన్‌రైజ్ పబ్లిక్ స్కూలులో అంకిత గుప్తా (5), మాన్య గుప్తా (7), సిద్ధార్ధ్ గుప్తా 950, అనుజ్ ప్రజాపతి (5) చదవుతున్నారు. స్కూలు పూర్తికావడంతో వీరంతా కేర్‌టేకర్‌తో కలిసి ఇంటిదారి పట్టారు. దారి మధ్యలో వినియోగంలో లేని పాడుబడిన ఇంటి పక్కగా వస్తుండగా అకస్మాత్తుగా ఆ ఇంటి గోడ కుప్పకూలిపడింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న నలుగురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ఒక మహిళ, మరో పిల్లవాడు గాయపడ్డారు. సమాచారం తెలియగానే స్థానికులు అధికారుల సహాయంతో మృతదేహాలను వెలికితీసి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు కలెక్టర్ ప్రతిభాపాల్ తెలిపారు. ఘటనపై విచారణ జరిపి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
సీఎం దిగ్భ్రాంతి
రేవాలో గోడ కూలి నలుగురు స్కూలు పిల్లలు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, తక్షణ సహాయక చర్యలకు ఆదేశించామని చెప్పారు. చిన్నారుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు.
Updated Date - Aug 03 , 2024 | 09:58 PM