FSSAI : ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాల్లో హానికర రసాయనాలు లేవు
ABN, Publish Date - May 22 , 2024 | 04:19 AM
ఎవరెస్ట్, ఎండీహెచ్ కంపెనీల మసాలాలు, ఇతర ఉత్పత్తుల్లో హానికర రసాయనాలు లేవని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) ప్రకటించింది. వీటి శాంపుల్స్‌లో ఇథిలీన్ ఆక్సైడ్ (ఈటీవో)గానీ, కాన్సర్ కారక రసాయనాలుగానీ లేవని తెలిపింది.
న్యూఢిల్లీ, మే 21: ఎవరెస్ట్, ఎండీహెచ్ కంపెనీల మసాలాలు, ఇతర ఉత్పత్తుల్లో హానికర రసాయనాలు లేవని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) ప్రకటించింది. వీటి శాంపుల్స్‌లో ఇథిలీన్ ఆక్సైడ్ (ఈటీవో)గానీ, కాన్సర్ కారక రసాయనాలుగానీ లేవని తెలిపింది. ఈ రెండు కంపెనీలు విక్రయించే ఉత్పత్తుల శాంపుల్స్‌ను విస్తృతంగా సేకరించి పరీక్షలు జరపగా ఈ విషయం వెల్లడైనట్టు పేర్కొంది. ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాల్లో అనుమతులకు మించి రసాయనాలున్నట్టు హాంకాగ్ ఫుడ్ అథారిటీ ఆరోపించిన నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ పరీక్షలు జరిపింది. మసాలాల్లో సూక్ష్మక్రిములు నశించేలా స్టెరిలైజ్ చేసేందుకు ఇథిలీలీన్ ఆక్సైడ్‌ను ఉపయోగిస్తుంటారు. ఇది పరిమితికి మించితే క్యాన్సర్ సహా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Updated Date - May 22 , 2024 | 04:19 AM