ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mukhtar Ansari: నేడు ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు.. మార్మోగుతున్న నినాదాలు, సీఎం ఆదేశం

ABN, Publish Date - Mar 30 , 2024 | 09:42 AM

ఉత్తర్ ప్రదేశ్‌(uttar pradesh)లో కరుడుగట్టిన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ(mukhtar ansari) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ఇవాళ ఆయన స్వగ్రామమైన యూపీలోని ఘాజీపూర్‌(ghazipur)లో కట్టుదిట్టమైన భద్రత మధ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన భౌతికకాయాన్ని శనివారం ఉదయం ఘాజీపూర్‌కు తరలించారు.

ఉత్తర్ ప్రదేశ్‌(uttar pradesh)లో కరుడుగట్టిన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ(mukhtar ansari) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ఇవాళ ఆయన స్వగ్రామమైన యూపీలోని ఘాజీపూర్‌(ghazipur)లో కట్టుదిట్టమైన భద్రత మధ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన భౌతికకాయాన్ని శనివారం ఉదయం ఘాజీపూర్‌కు తరలించారు. ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించకుండా చూడాలని సీఎం యోగి(yogi adityanath) పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఉత్తర్ ప్రదేశ్ అంతటా 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు జారీ చేయపడ్డాయి. బందా, మౌ, ఘాజీపూర్, వారణాసిలో స్థానిక పోలీసుల(police)తో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ముఖ్తార్ అన్సారీ నివాసం వెలుపల పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ నిరంతరం నిఘా ఉంచుతున్నారు.


మరోవైపు జైలులో అతనికి స్లో పాయిజన్ ఇచ్చారని అతని కుటుంబ సభ్యులు(family) ఆరోపించారు(allegations). ఈ నేపథ్యంలో శవపరీక్ష ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీశారు. అన్సారీ మృతిపై జ్యుడీషియల్ విచారణకు బండాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు సభ్యుల బృందం మెజిస్టీరియల్ విచారణ చేపట్టనుంది. ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మరణించినట్లు పోస్ట్‌మార్టంలో స్పష్టమైందని పీటీఐ తెలిపింది.

ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు షహబుద్దీన్ కుమారుడు ఒసామా వచ్చారు. ముఖ్తార్ అన్సారీ(mukhtar ansari) మృతిపై సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు సహా నాయకులు మహమ్మదాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని నాయకులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు పార్టీ అగ్రనాయకత్వం ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IPL 2024: నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

Updated Date - Mar 30 , 2024 | 09:43 AM

Advertising
Advertising