ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పెళ్లికి వేళాయే..!! త్వరలోనే అంటూ రాహుల్ హింట్

ABN, Publish Date - May 14 , 2024 | 03:20 AM

పెళ్లెప్పుడు...? కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి తరచూ ఎదురవుతోన్న ప్రశ్న ఇది.

Rahul Gandhi

మా కుటుంబం రాయబరేలి కోసం ఎంతో చేసింది: రాహుల్‌

రాయ్‌బరేలి, మే 13 : పెళ్లెప్పుడు...? కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి తరచూ ఎదురవుతోన్న ప్రశ్న ఇది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలోనూ సోమవారం ఇదే ప్రశ్న ఎదురవ్వడంతో ఆయన సమాధానం చెప్పక తప్పలేదు. త్వరలోనే(అబ్‌ జల్దీ కర్నీ పడేగీ) తాను పెళ్లి చేసుకోనున్నట్లు ఆయన చెప్పారు. రాయ్‌బరేలిలో సోమవారం ఒక బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. తన ప్రసంగం ముగిశాక రాహుల్‌ తన సోదరి ప్రియాంక గాంధీ వాధ్రాను వేదికపైకి పిలిచి రాయ్‌బరేలిలో ప్రచారానికి ఆమె చేసిన కృషిని ప్రశంసించారు. ఈ సమయంలో జనంలోంచి ఒకరు... పెళ్లెప్పుడు? అని ప్రశ్న సంధించారు. దానికి సమాధానం చెప్పాలని ప్రియాంక సూచించారు. దీంతో ‘‘అబ్‌ జల్దీ కర్నీ పడేగీ’’ అని రాహుల్‌ సమాధానమిచ్చారు. ఆయనకు వచ్చే నెలతో 54 ఏళ్లు నిండనున్నాయి. అంతకు ముందు రాహుల్‌ తన ప్రసంగంలో... తన కుటుంబం ఎప్పుడూ రాయ్‌బరేలి ప్రజల కోసం పనిచేసిందని వివరించారు. ప్రధానీ మోదీలా... అదానీ, అంబానీల కోసం పనిచేయలేదన్నారు. తన కుటుంబానికి ఇక్కడి ప్రజలతో ఎంతో అనుబంధం ఉన్నందునే తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో 22-25 మంది పెద్ద పారిశ్రామికవేత్తలకు రూ.16 లక్షల కోట్ల అప్పులను మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. ఇండియా కూటమి అధికారంలో వస్తే... పేద కుటుంబాల జాబితా రూపొందించి ఆ కుటుంబంలోని ఒక మహిళ బ్యాంకు ఖాతాకు ఏటా లక్ష రూపాయలు లేదా నెలకు రూ.8,500 జమ చేస్తామని ప్రకటించారు. రాయ్‌బరేలిలో ఐదో విడతలో మే 20న ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - May 14 , 2024 | 07:35 AM

Advertising
Advertising