ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.23 కోట్ల దున్నపోతు!

ABN, Publish Date - Nov 16 , 2024 | 03:22 AM

అన్‌మోల్‌.. అంటే ‘వెల కట్టలేనిది’ అని అర్థం! ఈ చిత్రంలో యముని మహిషంలా బలంగా కనపడుతున్న దున్నపోతు పేరు అదేగానీ.. దీనికి ఒక వెల ఉంది.

న్యూఢిల్లీ, నవంబరు15: అన్‌మోల్‌.. అంటే ‘వెల కట్టలేనిది’ అని అర్థం! ఈ చిత్రంలో యముని మహిషంలా బలంగా కనపడుతున్న దున్నపోతు పేరు అదేగానీ.. దీనికి ఒక వెల ఉంది. అది రెండు రోల్స్‌రాయ్‌స్‌ కార్ల ఖరీదంత. 10 బెంజ్‌ కార్ల ఖరీదంత. హైదరాబాద్‌లో ఔటర్‌ చుట్టుపక్కల 10 విల్లాలు కొనేంత ఖరీదు.. అక్షరాలా 23 కోట్ల రూపాయలు!! హరియాణాలోని సిర్సా జిల్లాకు చెందిన గిల్‌ అనే ఆసామీ వద్ద ఉందీ దున్నపోతు. దీని బరువు 1500 కిలోలు. మేలు జాతి జీవం కావడంతో దీని వీర్యానికి బోలెడంత డిమాండ్‌ ఉంది. ఎంతంటే.. అన్‌మోల్‌ వీర్యాన్ని అమ్మడం ద్వారా దీని యజమాని గిల్‌ నెలకు రూ.5 లక్షల దాకా సంపాదిస్తున్నాడు. దీన్ని ఆరోగ్యంగా ఉంచడం ద్వారా అంత ఆదాయం సంపాదించాలంటే.. అందుకు తగ్గ ఖర్చూ ఉంటుంది. దీనికి రోజూ పావుకిలో బాదం పప్పులు, నాలుగు కిలోల దానిమ్మ గింజలు, 30 అరటిపండ్లు, 5 లీటర్ల పాలు, 20 గుడ్లు పెడతారు. ఇవి కాక.. పచ్చగడ్డి, తవుడు, సోయా బీన్స్‌, మొక్కజొన్న వంటివి కూడా పెడతారు. అన్‌మోల్‌ ఇంత బలంగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం.. దీని తల్లి నుంచి దీనికి సంక్రమించిన జన్యువులేనని.. ఆ గేదె రోజుకు 25 లీటర్ల పాలు ఇచ్చేదని.. గిల్‌ తెలిపాడు.

Updated Date - Nov 16 , 2024 | 03:23 AM