ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

wayanad landslides: మూడు గంటల పాటు ఏకదాటిగా హరిణి శ్రీ భరత నాట్యం.. ఎందుకంటే..?

ABN, Publish Date - Aug 09 , 2024 | 08:29 AM

తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల హరిణీ శ్రీ వయనాడ్‌ ప్రజలకు నేను సైతం ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఆ క్రమంలో నిధులు సమకూర్చేందుకు మూడు గంటల పాటు ఏకధాటిగా భరతనాట్యం చేసింది. ఈ సందర్భంగా వచ్చిన నగదుతోపాటు తాను గతంలో దాచుకున్న సొమ్మును కేరళ చీఫ్ మినిస్టర్ డిస్ట్రేస్ రిలీఫ్ ఫండ్‌కు అందించింది. ఈ సందర్బంగా చిన్నారి హరిణీ శ్రీని కేరళ సీఎం పినరయి రవి అభినందించి, ఆశీర్వదించారు.

తిరువనంతపురం, ఆగస్ట్ 09: ప్రకృతి సృష్టించిన విపత్తు కారణంగా కేరళలో వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ముందుకు వచ్చి.. కేరళనకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల హరిణీ శ్రీ వయనాడ్‌ ప్రజలకు నేను సైతం ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.

ఆ క్రమంలో నిధులు సమకూర్చేందుకు మూడు గంటల పాటు ఏకదాటిగా భరతనాట్యం చేసింది. ఈ సందర్భంగా వచ్చిన నగదుతోపాటు తాను గతంలో దాచుకున్న సొమ్మును కేరళ చీఫ్ మినిస్టర్ డిస్ట్రేస్ రిలీఫ్ ఫండ్‌కు అందించింది. ఈ సందర్బంగా చిన్నారి హరిణీ శ్రీని కేరళ సీఎం పినరయి రవి అభినందించి, ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన వీడియోను కేరళ ప్రభుత్వం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Viral: గర్ల్ ఫ్రెండ్‌ కోసం.. ఓ టీనేజర్ ఘనకార్యం


మృతులు 417 మంది..

భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడడంతో.. కేరళలో వయనాడ్ జిల్లాలోని చూరల్మల, ముండక్క గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తులో 417 మంది మరణించారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది నిరాశ్రుయులయ్యారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని మోదీ ప్రభుత్వాన్ని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతోపాటు కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలకు చెందిన ఎంపీలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Maharashtra politics: తమ్ముడు నేటి నుంచి.. అన్నయ్య రేపటి నుంచి..


వయనాడ్‌లో రేపు ప్రధాని మోదీ..

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్ట్ 10వ తేదీన చూరల్మల, ముండక్క గ్రామాలలో పర్యటించనున్నారు. అలాగే నిరాశ్రయులు తలదాచుకున్న పునరావాస కేంద్రాలను సైతం ఆయన ఈ పర్యటనలో భాగంగా సందర్శించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన అనంతరం జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశముందని ఓ ప్రచారం సైతం సాగుతుంది.

Also Read: Independence Day 2024: ఆగస్ట్ 15 వేళ.. బీజేపీ హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమం


ఇప్పటికే పలుమార్లు స్పందించిన రాహుల్..

ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. అదీకాక బుధవారం పార్లమెంట్ జీరో అవర్‌లో వయనాడ్‌లో చోటు చేసుకున్న విపత్తుపై రాహుల్ గాంధీ గళం విప్పారు. ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న పరిణామాలను ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. ఈ విపత్తులో కొన్ని కుటుంబాలు మొత్తం తుడిచి పెట్టుకుని పోయాయన్నారు. మరికొన్ని కుటుంబాల్లో ఎవరో ఒకరు మాత్రమే అది కూడా చిన్నారు లేకుంటే పెద్దవారు మాత్రమే మిగిలి ఉన్నారని రాహుల్ సభలో సోదాహరణగా వివరించిన సంగతి తెలిసిందే.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 09 , 2024 | 08:30 AM

Advertising
Advertising
<