Home » Landslides
ఫెంగల్ తుపాను తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. తుపాను తీరం దాటినప్పటి నుంచీ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానల కారణంగా రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదు అవుతోంది.
ఇండోనేసియాలోని వెస్ట్ సుమత్రా ప్రావిన్స్లో బంగారు గని శుక్రవారం కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మంది సజీవ సమాధి అయ్యారు. తప్పిపోయిన మరో ఏడుగురి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు.
ప్రకృతి సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించనున్నారు. అందులో భాగంగా చూరల్మల, ముండక్కై గ్రామాలను ఆయన సందర్శించనున్నారు. అలాగే నిరాశ్రయులు తలదాచుకున్న పునరావాస కేంద్రాలను సైతం ఆయన సందర్శించనున్నారని సమాచారం.
తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల హరిణీ శ్రీ వయనాడ్ ప్రజలకు నేను సైతం ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఆ క్రమంలో నిధులు సమకూర్చేందుకు మూడు గంటల పాటు ఏకధాటిగా భరతనాట్యం చేసింది. ఈ సందర్భంగా వచ్చిన నగదుతోపాటు తాను గతంలో దాచుకున్న సొమ్మును కేరళ చీఫ్ మినిస్టర్ డిస్ట్రేస్ రిలీఫ్ ఫండ్కు అందించింది. ఈ సందర్బంగా చిన్నారి హరిణీ శ్రీని కేరళ సీఎం పినరయి రవి అభినందించి, ఆశీర్వదించారు.
‘ కంటేనే అమ్మ కాదు.. కరుణించే ప్రతీ దేవత అమ్మే ’.. అని ఓ కవి చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఏ బిడ్డ అయినా ఆకలితో ఉన్నా.. ఏడ్చినా అమ్మ చూస్తూ ఊరుకోదు.. ఏదో ఒకటి చేసేంత వరకూ అమ్మ మనసు ఊరుకోదు అంతే..! ఇలాంటి సన్నివేశమే కేరళలో కనిపించింది.. ఒకే ఒక్క సందేశంతో కోట్లాది మనసులను గెలుచుకుంది ఆ అమ్మ..! అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడిదే చర్చ..!
వైద్యుడిని దేవుడితో సమానంగా భావిస్తారు. చికిత్స ఒకటే కాదు వైద్య రంగంలో అణువణువునా వారి ప్రమేయం ఉంటుంది. మృతదేహాలను చూస్తేనే మనం వణికిపోతాం. అలాంటిది నుజ్జైన శరీరాలకు పోస్టుమార్టం చేయడంలో కూడా వైద్యులు కీలకంగా ఉంటారు.
కొండచరియలు విరిగిపడి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన వయనాడ్(Wayanad) దుర్ఘటన ప్రాంతాలను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) గురువారం సందర్శించారు.
దశాబ్ద కాలంలో భారత్లో జరిగిన అతిపెద్ద విషాదాల్లో కేరళలోని వయనాడ్(Wayanad Landslides) దుర్ఘటన చరిత్రలో నిలిచిపోతుంది. జులై 30 తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడిన ఘటనలో వయనాడ్ జిల్లాలోని ముండక్కై, చూరల్మల్లోని వందల సంఖ్యల్లో ఇళ్లు మట్టిదిబ్బల్లో కూరుకుపోయాయి.
కొండచరియలు విరిగిపడటంతో కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలోని రెండు గ్రామాలు తుడిచిపెట్టుకుపోవడంతో ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారికి భరోసానివ్వడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆగస్టు 1న వయనాడ్లో పర్యటించారు.
కేరళలోని వయనాడ్లో సంభవించిన ప్రకృతి విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం అందరికీ తెలిసిందే. బుధవారం కొండచరియలు విరిగిపడటంతో.. 167 మంది మృతి చెందారు. ఇంకా వందల..