ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gujarat Police : డిజిటల్‌ అరెస్టు ముఠా గుట్టు రట్టు

ABN, Publish Date - Oct 15 , 2024 | 04:38 AM

దేశవ్యాప్తంగా ‘డిజిటల్‌ అరెస్టు’ పేరుతో సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల ముఠా గుట్టును గుజరాత్‌పోలీసులు రట్టు చేశారు.

అహ్మదాబాద్‌, అక్టోబరు 14: దేశవ్యాప్తంగా ‘డిజిటల్‌ అరెస్టు’ పేరుతో సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల ముఠా గుట్టును గుజరాత్‌పోలీసులు రట్టు చేశారు. నలుగురు తైవానీయులతో సహా 17 మందిని అహ్మదాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ అరెస్టు చేసిందని పోలీసు ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు. నిందితుల నుంచి రూ.12.75 లక్షల నగదు, 761 సిమ్‌కార్డులు, 120 మొబైల్‌ ఫోన్లు, 42 బ్యాంకు పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేటుగాళ్లు దాదాపు వెయ్యి మందిని లక్ష్యంగా చేసుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అరెస్టు చేసిన వారిలో నలుగురు తైవానీయులు. మిగతా 13 మంది గుజరాత్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌, ఒడిశా, రాజస్థాన్‌కు చెందిన వాళ్లు ఉన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 04:48 AM