Gyanvapi: జ్ఞానవాపిలో హిందువులు పూజ చేయడంపై నేడు అలహాబాద్ హైకోర్టు తీర్పు
ABN, Publish Date - Feb 26 , 2024 | 09:52 AM
జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసేందుకు వారణాసి సెషన్స్ జడ్జి ఇటీవల అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దానిని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ రోజు అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది.
వారణాసి: జ్ఞానవాపి (Gyanvapi) మసీదు లోపల ఉన్న వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసేందుకు వారణాసి సెషన్స్ జడ్జి ఇటీవల అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దానిని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో ( Allahabad High Court) సవాల్ చేసింది. పిటిషన్‌పై ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ రంజన్ ఈ రోజు ఉదయం 10 గంటలకు తీర్పు ఇవ్వనున్నారు.
వారణాసి జిల్లా జడ్జి ఆదేశాలను మజ్లిస్ పార్టీ తప్పు పట్టింది. ఈ తీర్పు ప్రార్థన స్థలాల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయ పడ్డారు. పదవీ విమరణ చివరి రోజు న్యాయమూర్తి జారీచేసిన తీర్పు సరికాదన్నారు. వివాదం నెలకొనడంతో జ్ఞానవాపిలో 1993 నుంచి హిందువులు పూజ చేయడం లేదు. ఇటీవల కోర్టు తీర్పుతో పూజ చేయడం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రత్యేక పూజలు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 26 , 2024 | 09:52 AM