ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sandeshkhali: షాజహాన్‌ను అప్పగించాల్సిందే... బెంగాల్ సీఐడీకి హైకోర్టు ఆదేశం

ABN, Publish Date - Mar 06 , 2024 | 05:19 PM

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి కేసులో నిందితుడు షేక్‌ షాజహాన్‌ ను ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం సాయంత్రం 4.30 గంటల కల్లా అప్పగించాలని పశ్చిమబెంగాల్ సీఐడీని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. బెంగాల్ సీఐడీకి కోర్టు ధిక్కార నోటీసులు కూడా జారీ చేసింది.

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులపై దాడి కేసులో నిందితుడు షేక్‌ షాజహాన్‌ (Sheikh Shajahan)ను ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం సాయంత్రం 4.30 గంటల కల్లా అప్పగించాలని పశ్చిమబెంగాల్ సీఐడీ (CID)ని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కార నోటీసును సైతం జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లోగా జవాబివ్వాలని స్పష్టం చేసింది.


ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోల్‌కతా హైకోర్టు మంగళవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై వెంటనే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపై తక్షణమే విచారణ చేపట్టలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో కేసు బాధ్యతలు చేపట్టిన సీబీఐ మంగళవారం సాయంత్రమే కేసు నమోదుచేసింది. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పశ్చిమబెంగాల్ సీఐడీ కార్యాలయానికి అధికారులు వెళ్లారు. అయితే, షేక్ షాజహాన్‌ను అప్పగించేందుకు సీఐడీ నిరాకరించింది. ఫిబ్రవరి 29న నిందితుడిని బెంగాల్ పోలీసులు అరెస్టు చేయగా కేసును సీఐడీకి బెంగాల్ ప్రభుత్వం అప్పగించింది.

Updated Date - Mar 06 , 2024 | 05:22 PM

Advertising
Advertising