ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harishankar Jain : ఒవైసీని ఎంపీ పదవి నుంచి తొలగించండి

ABN, Publish Date - Jun 27 , 2024 | 04:26 AM

మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడని, ఆయన్ను వెంటనే ఎంపీ పదవి నుంచి తొలగించాలని ప్రముఖ అడ్వొకేట్‌ హరిశంకర్‌ జైన్‌ రాష్ట్రపతిని కోరారు.

రాష్ట్రపతి ముర్ముకు అడ్వొకేట్‌ హరిశంకర్‌ లేఖ

న్యూఢిల్లీ, జూన్‌ 26: మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడని, ఆయన్ను వెంటనే ఎంపీ పదవి నుంచి తొలగించాలని ప్రముఖ అడ్వొకేట్‌ హరిశంకర్‌ జైన్‌ రాష్ట్రపతిని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ లేఖ రాశారు. ఒవైసీ మంగళవారం ఎంపీగా ప్రమాణం చేసే సమయంలో ‘జై పాలస్తీనా’ అని నినదించిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు.

ఎవరైనా ఎంపీ పరదేశం పట్ల విధేయత ప్రకటిస్తే వారు ఆ పదవిలో కొనసాగటానికి అనర్హులని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102 దీన్నే నిర్దేశిస్తోందని పేర్కొన్నారు. ఒవైసీ అలా నినాదాలు చేయడం దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని జైన్‌ కోరారు. ఎంపీని తొలగించే అధికారం రాజ్యాంగం రాష్ట్రపతికి ఇచ్చిందని తెలిపారు. కాగా, ఒవైసీ ప్రమాణ స్వీకారం సందర్భంగా లోక్‌సభ హాలులో ‘‘జై భీమ్‌, జై ఎంఐఎం, జై తెలంగాణ, జై పాలస్తీనా’’ అని నినాదాలు చేశారు.

Updated Date - Jun 27 , 2024 | 07:20 AM

Advertising
Advertising