ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Haryana Assembly Elections: 65 శాతం పోలింగ్ నమోదు.. ఇక ఫలితాలపై ఉత్కంఠ

ABN, Publish Date - Oct 05 , 2024 | 06:48 PM

హర్యానా అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో సహా పలు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, హోరాహోరీ ప్రచారానంతరం ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్ సర్వేలు, మరో మూడు రోజుల్లో వెలువడే ఎన్నికల ఫలితాలపై తాజాగా ఉత్కంఠ నెలకొంది.

చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly Elections) పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి 65 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో సహా పలు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, హోరాహోరీ ప్రచారానంతరం ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్ సర్వేలు, మరో మూడు రోజుల్లో వెలువడే ఎన్నికల ఫలితాలపై తాజాగా ఉత్కంఠ నెలకొంది.

Haryana Exit Polls 2024: హర్యానాలో గెలిచేది ఆ పార్టీనే.. సంచలన రిపోర్ట్..


హర్యానాలోని అధికార బీజేపీ హ్యాటిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతుండగా, దశాబ్దం తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. వీటితో పాటు ఐఎన్ఎల్‌డీ -బీఎస్‌పీ కూటమి, జేజేపీ-ఆజాద్ సమాజ్ పార్టీ కూటమి, ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో ఉన్నాయి. ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైని, బీజేపీ నేతలు అనిల్ విజ్, ఓపీ ధన్‌కర్, కాంగరెస్ నేతలు భూపిందర్ సింగ్ హుడా, వినేష్ ఫోగట్, ఐఎన్ఎల్‌డీ నేత అభయ్ సింగ్ చౌతాలా, జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా తదితర ప్రముఖులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఈసారి జాట్‌లు, ఎస్సీల మద్దతును కూడగట్టుకుంది. భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని హస్తం పార్టీకి అనూకూల సంకేతాలు ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలం అధికారంలో ఉండటంతో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, కుల సమీకరణలు ఆ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కలిపి ఈనెల 8న వెలువడనున్నాయి.


Also Read:

కంటెంట్‌లో కల్తీ.. కేరాఫ్ సాక్షి..

హైడ్రా ఇక తగ్గేదే లే.. మరిన్ని పవర్స్..

ఎప్పుడూ నవ్వించే అతన్ని ఎలా ఓదార్చాలి..

For More National News and Telugu News..

Updated Date - Oct 05 , 2024 | 06:48 PM