Ravi Moun: రష్యా- ఉక్రెయిన్ యుద్దంలో హరియాణ వాసి మృతి
ABN, Publish Date - Jul 29 , 2024 | 11:14 AM
రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్దం కొనసాగుతుంది. అయితే ఈ యుద్దంలో పాల్గొన్న హరియాణలోని కైతల్ జిల్లా.. మాటోర్ గ్రామానికి చెందిన రవి మౌన్ మృతి చెందారు. ఈ మేరకు రష్యాలోని భారతీయ రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. రవి మృతికి సంబంధించిన సమాచారాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియ పరిచింది.
ఛండిగఢ్, జులై 28: రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్దం కొనసాగుతుంది. అయితే ఈ యుద్దంలో పాల్గొన్న హరియాణలోని కైతల్ జిల్లా.. మాటోర్ గ్రామానికి చెందిన రవి మౌన్ మృతి చెందారు. ఈ మేరకు రష్యాలోని భారతీయ రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. రవి మృతికి సంబంధించిన సమాచారాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియ పరిచింది.
అయితే అతడు ఏ కారణంగా మృతి చెందాడనే విషయాన్ని మాత్రం అతడి కుటుంబ సభ్యులకు రాయబార కార్యాలయం తెలియ పర్చలేదని సమాచారం. రష్యాలో రవి ఆచూకీ తెలియక గత అయిదు నెలలుగా హరియాణలోని అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్దంలో పాల్గొనాలంటూ.. రవిపై రష్యా సైన్యం బలవంతం చేసిందని అతడి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ఆరోపిస్తున్నారు.
Also Read: UPSC aspirants’ death: లోక్‌సభలో చర్చకు కాంగ్రెస్ సిద్ధం
తల్లి మరణం..
అయితే రవి తల్లి డిఎన్‌ఏ నివేదిక పంపితే.. మృతదేహాన్ని స్వస్థలానికి పంపుతామని అతడి కుటుంబ సభ్యులకు భారత రాయబార కార్యాలయం సూచించింది. రవి తల్లి ఇప్పటికే మరణించింది. అలాగే రవి తండ్రి సైతం తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకుని నివేదిక అందించేందుకు తాను సిద్దమని రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి రవి సోదరుడు అజయ్ తెలిపారు. ఈ మేరకు జులై 27వ తేదీన మాస్కోలోని భారతీయ రాయబార కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించారు.
Also Read: Rajasthan: సీఎంను హత్య చేస్తామంటూ బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు
జనవరి 23న రష్యా వెళ్లిన రవి..
ఈ ఏడాది జనవరి 23వ తేదీన ఉద్యోగం వెతుకునేందుకు గ్రామానికి చెందిన అయిదుగురు మిత్రులతో కలిసి రవి.. రష్యా బయలుదేరి వెళ్లారని తెలిపారు. హరియాణలో తమకున్న భూమిని విక్రయించడం ద్వారా వచ్చిన నగదుతో రవిని రష్యా పంపామని కుటుంబ సభ్యులు వివరించారు. అయితే రష్యాలో రవికి డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ తమకు హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా అతడి కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు.
ఒత్తిడి చేశారు.. ప్రధాని మోదీకి విజ్ఞప్తి..
ఇక ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్దంలో పాల్గొనాలని రవిపై రష్యా సైన్యం ఒత్తిడి చేసిందని వారు ఆరోపించారు. ఓ వేళ.. ఈ యుద్దంలో పాల్గొనకుంటే పదేళ్లు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించిందని చెప్పారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో ఈ యుద్దంలో పాల్గొన్నాడని రవి కుటుంబ సభ్యులు ఆవేదనతో తెలిపారు. మరోవైపు సాధ్యమైనంత త్వరగా రవి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీకి అతడి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ప్రధానిగా మోదీ బాధ్యతలు.. రష్యా పర్యటన..
మరోవైపు ప్రధానిగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన రష్యా పర్యటనకు వెళ్లారు. ఆ క్రమంలో ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతీయులను రష్యా సైన్యంలోకి తీసుకోవద్దంటూ పుతిన్‌కు ప్రధాని మోదీ విన్నవించారు. ఈ విన్నపం పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా స్పందించిన విషయం విధితమే. అందులోభాగంగా పలువురు భారతీయులను రష్యా నుంచి స్వదేశానికి పంపేశారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Jul 29 , 2024 | 11:14 AM