YouTubers: సహజీవనం చేసే యూట్యూబర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం.. తర్వాత ఏం జరిగిందంటే..?
ABN, Publish Date - Apr 13 , 2024 | 04:10 PM
డెహ్రాడూన్‌కు చెందిన గర్విట్, నందిని ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. యూట్యూబ్ చానెల్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసే వారు. మంచి పేరు తెచ్చుకున్నారు. వారి సంపాదన బాగుంది. ఆ జంటతో ఐదుగురు కలిసి ఉంటారు. ప్లేస్ మారిస్తే మరిన్ని మంచి షార్ట్ ఫిల్మ్స్ తీయొచ్చు.. మార్కెట్ పెంచుకోవచ్చని ఇటీవల హర్యానా వచ్చారు.
ఢిల్లీ: ఏం జరిగిందో తెలియదు.. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. యూట్యూబ్ (YouTube) చానెల్ ద్వారా చక్కగా సంపాదిస్తున్నారు. వారికి ఓ టీమ్ కూడా ఉంది. ఏదో విషయంపై గొడవ.. కలిసి బతకలేమని అనుకున్నారో ఏమో తెలియదు.. కానీ కలిసి ప్రాణాలు విడిచారు. హర్యానాలో (Haryana) ఈ విషాద ఘటన జరిగింది.
Kejriwal: ఇదేం పద్ధతి.. జైలులో కేజ్రీవాల్‌ను కలువనీయలేదు..?
ఏం జరిగిందంటే..?
డెహ్రాడూన్‌కు చెందిన గర్విట్, నందిని ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అక్కడ యూట్యూబ్ చానెల్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసే వారు. మంచి పేరు తెచ్చుకున్నారు. వారి సంపాదన బాగుంది. వారితో ఐదుగురు కలిసి ఉంటారు. ప్లేస్ మారిస్తే మరిన్ని మంచి షార్ట్ ఫిల్మ్స్ తీయొచ్చు.. మార్కెట్ పెంచుకోవచ్చని ఇటీవల హర్యానా వచ్చారు. అలా అనుకోవడమే తప్పయిపోయింది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
Video: సీఎం కోసం స్వీట్ షాప్‌కు వెళ్లిన రాహుల్ గాంధీ..తర్వాత ఏమైందంటే
లేట్ నైట్ షూట్ చేసి..
బహదూర్‌గఢ్‌లో గల రుహిల్ రెసిడెన్షి ఏడో అంతస్తులో ఆ జంట ఉంటున్నారు. లేట్ నైట్ షూట్ చేసుకొని వచ్చారు. ఇద్దరి మధ్య ఏదో విషయంపై తీవ్ర వాగ్వివాదం జరిగింది. తెల్లవారు జామున 6 గంటలకు ఏడో అంతస్తు నుంచి దూకారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరించారు. ఏం జరిగిందనే విషయం తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ఆ జంట మృతి గురించి కుటుంబాలకు సమాచారం అందజేశామని పోలీసులు వివరించారు.
BJP: అట్టహాసంగా అమిత్‌షా రోడ్‌షో.. మోదీ నినాదాలతో దద్దరిల్లిన మదురై
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 13 , 2024 | 04:10 PM