ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rains: మూడు జిల్లాలను ముంచెత్తిన ‘ఫెంగల్’

ABN, Publish Date - Dec 03 , 2024 | 11:38 AM

ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలు మూడు జిల్లాలను ముంచెత్తాయి. విల్లుపురం, కృష్ణగిరి, కడలూరు(Villupuram, Krishnagiri, Cuddalore) జిల్లాల్లో 40 నుంచి 50 సెం.మీ.లకు పైగా కుండపోతగా వర్షం కురిసింది. దీంతో ఆ జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది.

- విల్లుపురం, కడలూర, కృష్ణగిరి జిల్లాల్లో వరద బీభత్సం

చెన్నై: ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలు మూడు జిల్లాలను ముంచెత్తాయి. విల్లుపురం, కృష్ణగిరి, కడలూరు(Villupuram, Krishnagiri, Cuddalore) జిల్లాల్లో 40 నుంచి 50 సెం.మీ.లకు పైగా కుండపోతగా వర్షం కురిసింది. దీంతో ఆ జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. కడలూరు, విలుపురం జిల్లాలో శనివారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు చెరువులు, వాగులు, వంకలు నిండి కట్టలు తెగి జనావాసాలపై పొంగి ప్రవహిస్తున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Fenjal Cyclone: తమిళనాట ఆగని విధ్వంసం


కృష్ణగిరి జిల్లాల్లో రెండు రోజులపాటు కుండపోతగా కురిసిన వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో శనివారం ప్రారంభమైన వర్షాలు ఆదివారం ఉదయం వరకూ కొనసాగాయి. జిల్లాలోని ఊత్తాంగరైలో ఆదివారం 50 సెం.మీ. మేర వర్షం కురిసింది. ఊత్తాంగరై సమీపంలోని ఎక్కూరు అమ్మన్‌ చెరువు గండ్లు తెగి నీరు రహదారులను ముంచెత్తింది. వరద తాకిడికి రహదారి పక్కన ఉన్న వ్యాన్లు, కార్లు కొట్టుకుపోయాయి. వేల ఎకరాల్లో వరి నీట మునిగింది.


పాంబారు డ్యామ్‌కు వస్తున్న నీటిని అలాగే దిగువకు వదిలేయడంతో డ్యాం పరీవాహక ప్రాంతాలైన మూండ్రాంపట్టి, పావక్కల్‌, అత్తిపాడి పంచాయతీల పరిధిలోని గ్రామాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. పోచ్చంపల్లి పోలీసుస్టేషన్‌(Pochampally Police Station)లో వరదనీరు ప్రవేశించింది. ఇదే విధంగా ధర్మపురం, సేలం, నామక్కల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఏర్కాడులో మూడు రోజులుగా కురిసిన వర్షాలకు 40 అడుగుల వంతెన వద్ద మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. దీనితో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి.


నీట మునిగిన పంటలు..

విల్లుపురం జిల్లా సెంజిలో అప్పంబట్టు చెరువు, సాలైపుదూరు చెరువు, పోత్తువాయ్‌మలయరసన్‌ కుప్పం తదితర చెరువులకు గండ్లు పడటంతో సుమారు 50 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. సెంజి ప్రధాన చెరువు కూడా పూర్తి స్థాయిలో నిండింది. ఆ చెరువుకు గండ్లు పడే అవకాశం ఉండటంతో సెంజి ఎమ్మెల్యే మస్తాన్‌ అధికారులతో కలిసి ఆ చెరువు కరకట్టలను పటిష్టం చేయాలని ఆదేశించారు.


కోలుకుంటున్న పుదుచ్చేరి...

ఫెంగల్‌ తుఫాన్‌ తాకిడికి గురైన కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి వరద నుండి తేరుకుంటోంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు కుండపోతగా కురిసిన వర్షాలకు పుదుచ్చేరి, సమీప గ్రామాలు నీటమునిగాయి. సోమవారం మధ్యాహ్నానికి వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. సోమవారం ఎండకు వరద నీరు కాస్త తగ్గుతూ వచ్చింది. సోమవారం వర్షం ఆగిపోవటంతో రవాణా సదుపాయాలు మెరుగయ్యాయి.


బాధితులకు రూ.5వేల సాయం..

పుదుచ్చేరి ఫెంగల్‌ తుఫాను బాధితులైన రేషన్‌ కార్డుదారులకు రూ.5వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగసామి ప్రకటించారు. తుఫాను కారనంగా ఇళ్లు, పశువులు కోల్పోయినవారిని, మృతి చెందినవారి కుటుంబీకులను ఆదుకునేలా ఆర్థికసాయం అందించటానికి గాను ప్రభుత్వం రూ.210 కోట్ల మేర నిధులు మంజూరు చేసిందని చెప్పారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో 50 సెం.మీ. దాకా వర్షం కురిసి తీవ్ర నష్టాలను కలిగించిందన్నారు.

ధర్మపురిలో...

ధర్మపురి జిల్లాలో తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు కురిసి ధర్మపురిలోని అన్నై సత్యానగర్‌, ఆవిన్‌ నగర్‌, నంది నగర్‌ ప్రాంతాల్లోని నివాసాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇదే విధంగా ఆరూరు, బొమ్మిడి, పాపిరెడ్డిపట్టి, పాప్పారపట్టి, పెన్నగరం, పాలకోడ, కారిమంగళం తదితర ప్రాంతాల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి.


తేరుకోని విల్లుపురం, కడలూరు జిల్లాలు...

ఫెంగల్‌ తుఫాను ఆదివారం మధ్యాహ్నం పూర్తిగా తీరం దాటి కేరళ వైపు మళ్ళినా విల్లుపురం, కడలూరు జిల్లాల్లో వరద పరిస్థితులే కొనసాగుతున్నాయి. కళ్ళకురిచ్చి, తిరువణ్ణామలై జిల్లాల్లోనూ కురిసిన భారీ వర్షాలకు ఆ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విల్లుపురం, కడలూరు జిల్లాల్లో ప్రధాన చెరువులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి.

విల్లుపురం జిల్లాలో రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు తెన్‌పెన్నై, కోరైయారు వాగుల్లో వరద పరిస్థితి నెలకొంది. ఆ రెండు వాగులు పొంగడంతో మారంగియూరు, సేత్తూరు, పయ్యూరు, కొంగనారాయణూరు గ్రామలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పయ్యూరు ఫ్లైవర్‌ వైపు వెళ్లే దారి వరద ఉదృతికి తెగిపోయింది. ఇదే విధంగా శంకరాభరణి వాగుకు గండ్లు పడటంతో రహదారులను ముంచెత్తింది. దీంతో చెన్నై తిరుచ్చి రహదారి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.


కడలూరులో వరద ...

ఫెంగల్‌ తుఫాన్‌ కారణంగా కుండపోత వర్షాలకు అతలాకుతలమైన కడలూరు జిల్లాలో ప్రస్తుతం వరద పరిస్థితి అలాగే ఉంది.. ఆ జిల్లాలో ఐదువేలకు పైగా నివాసాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. సాత్తనూరు డ్యామ్‌ నుంచి అదనపు జలాలు విడుదల కావటంతో తెన్‌పెన్నైయారులోకి నీరు చేరటంతో కడలూరు జిల్లాలోని పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. కడలూరు, బన్రుట్టి, నైవేలి, విరుదాచలం, దిట్టకుడి, చిదంబరం, కాట్టుమన్నార్‌కోవిల్‌ వేపూరు తదితర ప్రాంతాలతోపాటు కడలూరు కార్పొరేషన్‌ పరిధిలోని ముత్తయ్యనగర్‌ జనావాస ప్రాంతాలన్నీ వరదనీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో కడలూ రు జిల్లాలో పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు. తిరువణ్ణామలై జిల్లాలోనూ ఫెంగల్‌ తుఫాన్‌ కారణంగా భారీగా వర్షాలు కురిశాయి.


ఈవార్తను కూడా చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..

ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు

ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..

ఈవార్తను కూడా చదవండి: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 03 , 2024 | 11:38 AM