Jharkhand: ఐదేళ్లలో సీఎం వయసు ఏడేళ్లు పెరిగింది
ABN, Publish Date - Nov 01 , 2024 | 02:59 PM
2019 నామినేషన్‌లో ఆయన తన వయస్సును 42 ఏళ్లుగా చెప్పుకోగా, ఈ ఏడాది దాఖలు చేసిన అఫిడవిట్‌లో 49 ఏళ్లుగా డిక్లేర్ చేయడం పలు ప్రశ్నలకు , విమర్శలకు దారితీసింది. దీనిపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.
సోరెన్ నామినేషన్ రద్దుకు బీజేపీ డిమాండ్
వయస్సులో వ్యత్యాసాల రీత్యా సోరెన్ నామినేషన్ రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఐదేళ్ల సమయంలో ఏ వ్యక్తి వయస్సయినా ఏడేళ్ల ఎలా పెరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రతినిధి ప్రఫుల్ సాహదేవ్ ప్రశ్నించారు. సోరెన్ ఆదాయం రూ.10 లక్షల నుంచి రూ.4 లక్షలకు తగ్గడాన్ని కూడా పార్టీ నిలదీసింది. అఫివిడవిట్‌లో పలు ఆస్తుల వివరాలు వెల్లడించలేదని ఆరోపించింది. దీనిపై ఎన్నికల అధికారులకు బీజేపీ ఫిర్యాదు చేసింది.
జేఎంఎం మొత్తం ఫేక్: హిమంత్ బిస్వ శర్మ
జేఎంఎం సిస్టమ్ అంతా ఫేక్ అని అసోం ముఖ్యమంత్రి, జార్ఖాండ్ బీజేపీ కో-ఇన్‌చార్జి హిమంత బిస్వ శర్మ అరోపించారు. అఫిడవిట్‌లో జేఎంఎం నేతలు సమర్పించిన వివరాలు చూస్తే వాళ్ల వయస్సు పెంచి చెబుతున్నట్టు తెలుస్తుందన్నారు. ఇది చొరబాటుదారుల ప్రభుత్వమని, మళ్లీ జేఎంఎం అధికారంలోకి వస్తే ఎవరికీ భద్రత ఉండదని, జేఎంఎంను గద్దె దింపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని చెప్పారు. గిరిజన కమ్యూనిటీని కించపరచే వ్యాఖ్యలు చేసిన ఇర్ఫాన్ అన్సారీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తప్పుపట్టారు.
జేఎంఎం కౌంటర్
బీజేపీ నిరాశానిస్పృహల కారణంగానే సోరెన్‌పై తప్పుడు విమర్శలు చేస్తోందని జేఎంఎం తిప్పికొట్టింది. నామినేషన్ కోసం సమర్పించిన డాక్యుమెంట్లను వెరిఫై చేశారని, బీజేపీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని జేఎంఎం నేత మనోజ్ పాండే తెలిపారు. అఫిడవిట్లపై బీజేపీ దృష్టి సారించడం చూస్తే జార్ఖాండ్‌లో భారీగా దెబ్బతగలుతుందనే భయం వాళ్లలో కనిపిస్తోందన్నారు. డిక్లరేషన్ల విషయంలో జేఎంఎం పారదర్శకంగానే ఉంటుందన్నారు.
ప్రజలను తప్పదారిపట్టించే ఎత్తుగడ
కాగా, బీజేపీ ఆరోపణలన్నీ ప్రజలను తప్పుదారి పట్టించే ఎత్తుగడలుగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ప్రజలను తప్పుదారి పట్టేంచేలా కొత్త అంశాలతో బీజేపీ వచ్చినప్పటికీ తిరిగి అధికారం చేపట్టేది మాత్రం తామేనని (జేఎంఎం-కాంగ్రెస్ కూటమి) స్పష్టంచేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
Diwali 2024: దీపావళి ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత విషపూరితం
PM Modi: చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
For National News And Telugu News...
Updated Date - Nov 01 , 2024 | 03:05 PM