Hemant Soren: సుప్రీంకోర్టును ఆశ్రయించిన హేమంత్ సోరెన్.. పిటిషన్ రేపు విచారణ
ABN, Publish Date - Feb 01 , 2024 | 12:50 PM
జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. హేమంత్ సోరెన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. శుక్రవారం నాడు విచారిస్తామని హేమంత్ సోరెన్ లాయర్లు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీలకు సమాచారం ఇచ్చింది.
ఢిల్లీ: జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ (Hemant Soren) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. హేమంత్ సోరెన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం నాడు విచారిస్తామని హేమంత్ సోరెన్ లాయర్లు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీలకు సమాచారం ఇచ్చింది. భూ ఆక్రమణ కేసులో ఈడీ అధికారులు హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు జార్ఖండ్ హైకోర్టులో హేమంత్ సోరెన్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ గురువారం ఉదయం 10.30 గంటలకు విచారించాల్సి ఉంది. అంతలోనే పిటిషన్‌ను హేమంత్ సోరెన్ వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి హేమంత్ సోరెన్ న్యాయవాదులు తీసుకెళ్లారు.
‘హేమంత్ సోరెన్ ఇలా అరెస్ట్ చేస్తే చేయడం సరి కాదు. సోరెన్ అరెస్ట్ విషయంలో ఈడీ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారు. రాత్రి 10 గంటలకు అరెస్ట్ అని మెమోలో చూపించారు. సాయంత్రం 5 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు మందు, ప్రతిపక్ష నేతను ఈ విధంగా అరెస్ట్ చేయడం సరికాదు అని’ హేమంత్ సోరెన్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 01 , 2024 | 12:50 PM