ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

P Chidambaram: ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో చిదంబరానికి ఊరట

ABN, Publish Date - Nov 20 , 2024 | 02:54 PM

ఈడీ చార్జిషీటును పరిగణనలోకి తీసుకుని విచారణకు ట్రయిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని చిదంబరం హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై సింగిల్ జడ్జి తాజా ఆదేశాలు జారీ చేస్తూ, చిదంబర పిటిషన్‌పై స్పందించాలని ఈడీని ఆదేశించారు. తదుపరి విచారణను 2025 జనవరికి వాయిదా వేశారు.

న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్-మాక్సిస్ (Aircel-Maxis) మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి (P Chidambaram) ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై విచారణకు అనుమతిస్తూ విచారణ కోర్టు (Trail Court) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. జస్టిస్ మనోజ్ కుమార్ ఒహ్రితో కూడిన ఏక సభ్య ధర్మాసనం ఈడీకి నోటీసులు సైతం జారీ చేసింది. ఈడీ చార్జిషీటును పరిగణనలోకి తీసుకుని విచారణకు ట్రయిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని చిదంబరం హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై సింగిల్ జడ్జి తాజా ఆదేశాలు జారీ చేస్తూ, చిదంబర పిటిషన్‌పై స్పందించాలని ఈడీని ఆదేశించారు. తదుపరి విచారణను 2025 జనవరికి వాయిదా వేశారు.

Maharashtra Assembly Elections: ఓటేసిన సచిన్, అక్షయ్, రితేష్


సీనియర్ అడ్వకేట్ ఎన్.హరిహరన్ హైకోర్టులో తన వాదన వినిపిస్తూ, నేరం జరిగిందని ఆరోపిస్తున్న సమయంలో చిదంబరం పబ్లిక్ సర్వెంట్‌గా ఉన్నందున ప్రాసిక్యూషన్ అనుమతులు లేకుండా ట్రయిల్ కోర్టు విచారణకు అనుమతించరాదని వాదించారు. ఇటీవల సుప్రీంకోర్టు సైతం మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద పబ్లిక్ సర్వెంట్‌ను ప్రాసిక్యూట్ చేయాలంటే ఈడీ తప్పనిసరిగా అనుమతి పొందాలని ఒక కేసులో స్పష్టం చేసింది. కాగా, ఇది చిదంబరం అధికారిక విధులకు సంబంధించిన కేసు కాదని, చిదంబరం చర్యలకు సంబంధించి ఆరోపణలు అయినందున ప్రాసిక్యూషన్‌కు అనుమతి అవసరం లేదని చిదంబరం పిటిషన్‌పై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది.


ఏమిటీ కేసు?

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా చిదంబరం ఉన్నప్పుడు ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందంలో ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమేషన్ బోర్డు అనుమతుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. యూపీఏ-1 ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగా 2006లో చిదంబరం ఈ డీల్‌కు అనుమతులు ఇచ్చారు. రూ.3,500 కోట్ల ఈ డీల్‌లో చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరం ముడుపులు తీసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసుపై 2018 జూలైలో సీబీఐ, ఈడీ చార్జిషీట్లు దాఖలు చేశాయి. 2021లో సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లను విచారణ కోర్టు పరిగణనలో తీసుకుంది. చిందబరం, ఆయన కుమారుడు, ఇతర నిందితులకు మనీలాండరింగ్ కింద సమన్లు జారీ చేసేందుకు తగిన ఆధారాలున్నాయని విచారణ కోర్టు పేర్కొంది.


ఇవి కూాడా చదవండి...

Former Minister: నటుడు విజయ్‌ పార్టీతో పొత్తుకోసం ఇంకా చర్చించలేదు

TVK: టీవీకే పార్టీపై ఇంటెలిజెన్స్‌ నిఘా..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 20 , 2024 | 05:29 PM