ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: బ్యాంక్‌ ఖాతాల్లో ‘పొంగల్‌’ నగదు..

ABN, Publish Date - Dec 04 , 2024 | 01:29 PM

పొంగల్‌ నగదు బహుమతి బ్యాంక్‌ ఖాతాల్లో జమచేయవచ్చని హైకోర్టు మదురై బెంచ్‌ సూచించింది. తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన విమనాథన్‌ హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌(High Court Madurai Division Bench)లో దాఖలుచేసిన పిటిషన్‌లో... రాష్ట్రంలో రేషన్‌ కార్డుదారులకు అందించే పొంగల్‌ సరుకుల గిఫ్ట్‌ ప్యాక్‌లో చక్కెరకు బదులుగా కిలో బెల్లం ఇవ్వాలని, పొంగల్‌ బహుమతిగా ఇస్తున్న రూ.1,000 నగదు కార్డుదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమచేసేలా ఉత్తర్వులు జారీచేయాలని హైకోర్టు మదురై బెంచ్‌లో గత ఏడాది పిటిషన్‌ వేశారు.

- సూచించిన మదురై హైకోర్టు బెంచ్‌

చెన్నై: పొంగల్‌ నగదు బహుమతి బ్యాంక్‌ ఖాతాల్లో జమచేయవచ్చని హైకోర్టు మదురై బెంచ్‌ సూచించింది. తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన విమనాథన్‌ హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌(High Court Madurai Division Bench)లో దాఖలుచేసిన పిటిషన్‌లో... రాష్ట్రంలో రేషన్‌ కార్డుదారులకు అందించే పొంగల్‌ సరుకుల గిఫ్ట్‌ ప్యాక్‌లో చక్కెరకు బదులుగా కిలో బెల్లం ఇవ్వాలని, పొంగల్‌ బహుమతిగా ఇస్తున్న రూ.1,000 నగదు కార్డుదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమచేసేలా ఉత్తర్వులు జారీచేయాలని హైకోర్టు మదురై బెంచ్‌లో గత ఏడాది పిటిషన్‌ వేశారు.

ఈ వార్తను కూడా చదవండి: ఇద్దరు పెళ్లాల ముద్దుల దొంగ.. ఏడుగురు పిల్లలతో పోషణ భారం


ఈ కేసు విచారించిన హైకోర్టు, బ్యాంక్‌ ఖాతాలో నగదు జమ అంశాన్ని వచ్చే ఏడాది పరిశీలించాలని ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే ఏడాది పొంగల్‌కు ఇంకా ఒకటిన్నర నెల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పటి వరకు పొంగల్‌ నగదు బహుమతి బ్యాంక్‌ ఖాతాల్లో జమచేసే విషయమై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల, 2025 పొంగల్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లో చక్కెరకు బదులుగా బెల్లం ఇవ్వడం, నగదు బహుమతి బ్యాంక్‌ ఖాతాల్లో జమచేయాలి, గిఫ్ట్‌ ప్యాక్‌లో అందించే చెరకు, టెంకాయ తదితరాలు రాష్ట్ర రైతుల నుంచే కొనుగోలు చేసేలా ఉత్తర్వులు జారీచేయాలని తాజాగా పిటిషన్‌ దాఖలైంది.


ఈ పిటిషన్‌ను మంగళవారం న్యాయమూర్తులు ఎంఎస్‌ సురేష్‌, ఏటీ మరియక్లాట్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. పొంగల్‌ నగదు బహుమతి బ్యాంక్‌ ఖాతాల్లో జమచేయవచ్చు కదా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. రూ.1,000 నగదు బ్యాంక్‌ ఖాతాల్లో జమచేసే సమయంలో, ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ లేదంటూ, జమచేసే నగదు తీసుకుంటున్నారని అందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు.


అంతలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది మహిళ ప్రోత్సాహన నిధులు బ్యాంక్‌ ద్వారా అందిస్తున్న నేపథ్యంలో, పొంగల్‌ నగదు కూడా బ్యాంక్‌ ఖాతాల్లో చెల్లించాలంటూ తెలిపారు. ఇరుతరఫు వాదనల అనంతరం ధర్మాసనం, హైకోర్టు ఇదివరకే సూచించిన విధంగా పొంగల్‌ నగదు బహుమతి రేషన్‌ కార్డుదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమచేయడంపై వినియోగదారుల వాణిజ్య సమాఖ్య అదనపు కార్యదర్శి అఫిడివిట్‌ దాఖలుచేయాలని ఉత్తర్వులు జారీచేసి, తదుపరి విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదావేశారు.


ఈవార్తను కూడా చదవండి: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...

ఈవార్తను కూడా చదవండి: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..

ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 04 , 2024 | 01:29 PM