ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Naga Human Skull: కేంద్రమంత్రికి సీఎం లేఖ.. ఆగిన వేలం

ABN, Publish Date - Oct 09 , 2024 | 06:58 PM

భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో నాగా మానవ అవశేషాల వేలం వేయలనే నిర్ణయాన్ని బ్రిటన్ విరమించుకుంది. బ్రిటన్‌లో నాగా మానవ అవశేషాలను బుధవారం అన్ లైన్ వేలం వేయాలని బ్రిటన్ నిర్ణయించింది. ఈ వేలం వేయడంపై భారత్‌లోని ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

కోహిమా, అక్టోబరు 9: భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో నాగా మానవ అవశేషాల వేలం వేయలనే నిర్ణయాన్ని బ్రిటన్ విరమించుకుంది. బ్రిటన్‌లో నాగా మానవ అవశేషాలను బుధవారం అన్ లైన్ వేలం వేయాలని బ్రిటన్ నిర్ణయించింది. ఈ వేలం వేయడంపై భారత్‌లోని ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నాగా మానవ అవశేషాల వేలాన్ని వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కి నాగాలాండ్ సీఎం నీఫియు రియో విజ్జప్తి చేశారు.

Aam Aadmi Party: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ


ఈ మేరకు కేంద్ర మంత్రి జై శంకర్‌కు నాగాలాండ్ సీఎం నీఫియు రియో లేఖ రాశారు. దీంతో కేంద్ర మంత్రి జై శంకర్ జోక్యంతో.. ఈ వేలం నిర్ణయాన్ని బ్రిటన్ విరమించుకుంది. అయితే ఈ వేలాన్ని నిలిపివేయాలంటూ నాగాలాండ్‌లోని నాగా సొసైటీ.. ఫోరం ఫర్ నాగా రీకన్సిలియేషన్ (ఎఫ్ఎన్ఆర్) .. సీఎం రియోకు సూచించింది. దీంతో ఆయన.. కేంద్రమంత్రికి ఆగమేఘాల మీద లేఖ రాశారు.

Also Read: Dussehra Holidays: వరుసగా బ్యాంకులకు సెలవులు

Also Read: ఇలా చేస్తే మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీకి ఎక్కువ లైఫ్ ఉంటుంది.. అది ఎలాగంటే..?


బ్రిటన్‌లో నాగ మానవ అవశేషాలను అన్ లైన్‌లో వేలం వేయనున్నారంటూ భారీ ప్రచారం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజల భావోద్వేగానికి సంబంధించిన అంశం కావడంతో అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిని సైతం రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అలాగే నాగా మానవ అవశేషాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలు ఎంత పవిత్రంగా వ్యవహరిస్తారనే అంశాన్ని సైతం కేంద్ర మంత్రికి రాసిన లేఖలో సీఎం స్పష్టం చేశారు.

Also Read: Nobel Prize in Chemistry 2024: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

Also Read: Hydra: జీతం ఇచ్చేందుకు రెడీ.. మీరు సిద్దమా అని సవాల్


భారత్‌కు సంబంధించి అత్యంత పూరాతనమైన వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత పురాతన వస్తువులను బుధవారం బ్రిటన్‌లో అన్ లైన్‌లో వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో నాగా మానవ అవశేషాలను సైతం వేలంలో ఉంచింది. దీనిపై నాగాలాండ్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ విషయాన్ని గ్రహించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రియో.. ఈ వేలాన్ని ఆపేందుకు జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. దీంతో ఈ వేలాన్ని బ్రిటన్‌ నిలివేస్తూ నిర్ణయం తీసుకుంది.

For National News And Telugu News..

Updated Date - Oct 09 , 2024 | 07:00 PM