ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హిమాచల్‌ భవన్‌ను వేలం వేసుకొని మీకు రావాల్సిన బకాయిలు తీసుకోండి

ABN, Publish Date - Nov 20 , 2024 | 04:22 AM

ఓ విద్యుత్తు సంస్థకు రూ.150 కోట్ల బకాయిలు చెల్లించడంలో హిమాచల్‌ ప్రభుత్వం విఫలమయినందున ఢిల్లీలోని హిమాచల్‌ భవన్‌ను స్వాధీనం చేసుకొని వేలం వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

విద్యుత్తు సంస్థకు హిమాచల్‌ హైకోర్టు అనుమతి

సిమ్లా, నవంబరు 19: ఓ విద్యుత్తు సంస్థకు రూ.150 కోట్ల బకాయిలు చెల్లించడంలో హిమాచల్‌ ప్రభుత్వం విఫలమయినందున ఢిల్లీలోని హిమాచల్‌ భవన్‌ను స్వాధీనం చేసుకొని వేలం వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెలి హైడ్రోపవర్‌ ఎలక్ట్రికల్‌ కంపెనీకి అనుకూలంగా సోమవారం జస్టిస్‌ మదన్‌ మోహన్‌ గోయల్‌ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. లహౌల్‌, స్పిటి జిల్లాల్లో చెనాబ్‌ నదిపై 340 మెగావాట్టుల విద్యుత్తు ఉత్పాదన ప్రాజెక్టు నిర్మించేందుకు సెలి కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ కంపెనీ రూ.64 కోట్లను బయానా రూపంలో చెల్లించింది. అయితే ప్రాజెక్టు పనులను ప్రారంభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం.. కేటాయింపు లేఖను రద్దు చేయడంతో పాటు, బయానాగా చెల్లించిన రూ.64 కోట్లను కూడా జప్తు చేసింది. దీనిపై ఆ కంపెనీ మధ్యవర్తి (ఆర్బిట్రేటర్‌)ని ఆశ్రయించింది. బయానా సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని ఆర్బిట్రేటర్‌ ఆదేశించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ కంపెనీ హైకోర్టులో అప్పీలు చేసింది. కంపెనీ బయానాగా ఇచ్చిన డబ్బుకు 7ు వడ్డీ కలిపి రూ.150 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీన్ని వసూలు చేయడానికి హిమాచల్‌ భవన్‌ను వేలం వేసుకోవచ్చని ఆ కంపెనీకి సూచించింది.

Updated Date - Nov 20 , 2024 | 04:23 AM