ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Heavy Snowfall: ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో మంచువర్షంతో స్కూళ్లకు సెలవులు, ప్రయాణాలు బంద్

ABN, Publish Date - Feb 20 , 2024 | 08:20 AM

దేశంలోని సౌత్ రాష్ట్రాల్లో ఎండాకాలం రాకముందే పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. కానీ ఉత్తరాదిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్‌లోని అనేక చోట్ల పెద్ద ఎత్తున మంచు వర్షం కురుస్తోంది.

దేశంలోని సౌత్ రాష్ట్రాల్లో ఎండాకాలం రాకముందే పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. కానీ ఉత్తరాదిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్‌(himachal pradesh)లోని అనేక చోట్ల పెద్ద ఎత్తున మంచు వర్షం(Heavy Snowfall) కురుస్తోంది. ఈ నేపథ్యంలో ద్రాస్, కార్గిల్, లాహౌల్-స్పితి, కులు, కిన్నౌర్ జిల్లాల ఎగువ ప్రాంతాలు మొత్తం దాదాపు మంచుతో నిండి పోయాయి. గిరిజన జిల్లా లాహౌల్-స్పితిలో హిమపాతం దృష్ట్యా జిల్లాలోని విద్యాసంస్థలకు రెండు రోజులు(ఫిబ్రవరి 20, 21 తేదీల్లో) సెలవుగా ప్రకటించారు.


హిమపాతం(Snowfall) కారణంగా పలు ప్రాంతాల్లో మంచుకొండలు జారిపడే అవకాశం ఉందని అక్కడి అధికారులు ప్రజలను(people) అలర్ట్ చేశారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు పర్యాటకులు, స్థానిక ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తదుపరి ఆదేశాల వరకు సోలాంగ్ బారియర్ నుంచి అటల్ టన్నెల్ రోహ్‌తంగ్ వైపు అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధించారు. మరోవైపు ఇప్పటికే భారీగా కురిసిన హిమపాతాన్ని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. విద్యుత్, నీరు, ట్రాఫిక్ వ్యవస్థ సజావుగా సాగేందుకు సిబ్బంది రంగంలోకి దిగారు.

ఇదే సమయంలో ఫిబ్రవరి 20న అక్కడి వాతావరణ శాఖ(Meteorological Department) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిబ్రవరి 21న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కూడా రావచ్చని తెలిపింది. ఫిబ్రవరి 22న కూడా రాష్ట్రంలో వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. లాహౌల్ లోయలో ఇప్పటి వరకు ఒకటి నుంచి రెండు అడుగుల వరకు మంచు కురిసిందని, మంచు కురుస్తూనే ఉందని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - Feb 20 , 2024 | 08:20 AM

Advertising
Advertising