ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Priyanka Gandhi: 30 ఏళ్లుగా హౌస్‌వైఫ్‌గా ఉన్నా, నా వాయిస్ చాలా పెద్దది

ABN, Publish Date - Oct 29 , 2024 | 09:04 PM

వయనాడ్ ప్రజాసమస్యలపై గట్టిగా గళం విప్పుతానని ఆ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చుంగ్‌థారాలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.

చుంగ్‌థారా: గృహిణిగా తనకున్న అనుభవాన్ని వయనాడ్ (Wayanad) ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) చమత్కారంగా చెప్పారు. తనది చాలా పెద్ద వాయిస్ (Loud voice) అని, తన భర్త కూడా దీన్ని ధ్రువీకరించారని అన్నారు. అదే తరహాలో ప్రజాసమస్యలపై తాను గట్టిగా గళం విప్పుతానని వయనాడ్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చుంగ్‌థారాలో మంగళవారంనాడు ఆమె ప్రచారం సాగించారు.

Sharad Pawar: పదవి కోసం కుటుంబాన్ని చీల్చావు.. అజిత్‌పై సీనియర్ పవార్ నిప్పులు


''30 ఏళ్లకు పైగా ఇంటి యజమానురాలిగా ఉన్నాను. నాది చాలా పెద్ద వాయిస్. ఆ విషయం మీకు నా భర్త చెబుతారు. మీ కోసం ఇక్కడొక ఫైటర్ ఉన్నారు. మీరు నాకు మద్దతిచ్చి ఎంపీని చేస్తే మమ్మల్ని ఎంతమాత్రం నిరాశ పరచను'' అని ప్రియాంక తన ప్రసంగంలో పేర్కొన్నారు.


బీజేపీపై నిప్పులు

బీజేపీపై ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. వివిధ మతాల మధ్య ప్రశాంతంగా, పరస్పర సుహృద్భావంతో ఉండే సంబంధాలను గత పదేళ్లుగా బీజేపీ ధ్వంసం చేసిందని అన్నారు. మతాల మధ్య భయం, విద్వేషం, కోపం, అపనమ్మిక అనే విత్తనాలను బీజేపీ నాటిందని ఆరోపించారు. ప్రజలను పక్కనపెట్టి ఐదారుగురు వాణిజ్య మిత్రులకే ప్రధాని లబ్ధి చేకూరుస్తున్నారని, ప్రజలకు తెలియకుండా అన్ని పోర్టులు, విమానాశ్రయాలు, పీఎస్‌యూ సబ్సిడరీలు, భారా రోడ్ ప్రాక్టులు వంటివన్నీ తన వ్యాపార మిత్రులకే అప్పగిస్తున్నారని విమర్శించారు. వయనాడ్ వరద బాధితులను పరామర్శించడానికి ప్రధాని వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఆయన వచ్చి నెలలు అయినప్పటికీ వయనాడ్ ప్రజలు తమ జీవితాలను తిరిగి చక్కదిద్దేందుకు అవసరమైన నిధులను మాత్రం విడుదల చేయలేదన్నారు. ఇది బీజేపీ మార్క్ రాజకీయమని చెప్పారు. ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాయబేరిలి, వయనాడ్‌ నియోజకవర్గాల్లో గెలిచారు. నిబంధనల ప్రకారం ఒక నియోజకవర్గాన్ని వదులుకోవలసి రావడంతో వయనాడ్ సీటుకు రాజీనామా చేశారు. దీంతో వయనాడ్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 13న ఇక్కడ పోలింగ్ జరుగనుంది.


ఇవి కూడా చదవండి..

కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు

ఉగ్రవాదుల చేతుల్లో ఆర్మీ శునకం ఫాంటమ్ మృతి.. ఎలా జరిగిందంటే

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 29 , 2024 | 09:06 PM