ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Himanta Biswa Sharma: అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం?... మమతపై హిమంత బిస్వ శర్మ ఫైర్

ABN, Publish Date - Aug 28 , 2024 | 08:37 PM

''బెంగాల్‌ తగలబడితే అసోం కూడా తగులబడుతుంది'' అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో దీదీని నిలదీశారు.

కామరూప్ మెట్రోపాలిటన్: ''బెంగాల్‌ తగలబడితే అసోం కూడా తగులబడుతుంది'' అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (Himanta Biswa Sharma) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో దీదీని నిలదీశారు.


''దీదీ..అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం? మా మీద కళ్లు ఎర్ర చేయకండి. మీ రాజకీయ వైఫల్యాలకు ఇండియాను తగులపెట్టే ప్రయత్నం కూడా చేయొద్దు. విభజన భాషలో మీరు మాట్లాడటం సరికాదు'' అని హిమంత్ బిస్వా శర్మ ట్వీట్ చేశారు.

President Droupadi Murmu: కోల్‌కతా ఘటన భయానకం.. రాష్ట్రపతి తొలి స్పందన


మమత ఏమన్నారు?

కోల్‌కతా మహిళా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై బెంగాల్‌లో మంటలు పెట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన పార్టీని ఉసిగొలుపుతున్నారని తృణమూల్ విద్యార్థి విభాగం స్థాపించిన రోజును పురస్కరించుకుని బుధవారంనాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్‌లో అశాంతి ఇతర రాష్ట్రాలకు కూడా తీవ్ర పరిణామాలు కలిగిస్తుందని హెచ్చరించారు. ''బెంగాల్ తగులబడితే, అసోం, ఈశాన్యం, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖాండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడతాయి. మీ కుర్చీని కూడా పడగొడతాం'' అని మమత అన్నారు.


పశ్చిమబెంగాల్‌ను అస్థిర పరచేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని మమత ఆరోపించారు. ''కొందరు ఇది బంగ్లాదేశ్ అని అనుకుంటున్నారు. వాళ్లు గుర్తుంచుకోవాలి. నేను బంగ్లాదేశ్‌ను ప్రేమిస్తున్నారు. వాళ్లు కూడా మనలాగే మట్లాడతారు, వారి సంస్కృతి కూడా మనలాగే ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ వేరే దేశం, మనది వేరే దేశం'' అని మమతా బెనర్జీ తెలిపారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 28 , 2024 | 08:38 PM

Advertising
Advertising