ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Voter List: ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా? చెక్ చేసుకోండిలా

ABN, Publish Date - Mar 25 , 2024 | 12:59 PM

దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 16న ఎన్నికలు ప్రారంభమై జూన్ 1 వరకు కొనసాగుతాయి. ఓటర్ల సౌకర్యార్థం ఈసీ ఓటర్ హెల్ప్ యాప్‌ని ప్రారంభించింది. ఇది అనేక ఇతర విషయాలతోపాటు ఓటరు జాబితాలో మీ పేరును తనిఖీ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. మీ పేరు ఓటర్ జాబితాలో ఉందా.. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవడానికి కింది స్టెప్స్ అనుసరించండి.

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ చాలా మంది ఈ ఏడాది ఓటు హక్కును పొందే ఉంటారు. భారత ఎన్నికల సంఘం మార్చి 16న సమావేశం నిర్వహించి.. ఎన్నికల తేదీలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 16న ఎన్నికలు ప్రారంభమై జూన్ 1 వరకు కొనసాగుతాయి.

ఓటర్ల సౌకర్యార్థం ఈసీ ఓటర్ హెల్ప్ యాప్‌ని ప్రారంభించింది. ఇది అనేక ఇతర విషయాలతోపాటు ఓటరు జాబితాలో మీ పేరును తనిఖీ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. మీ పేరు ఓటర్ జాబితాలో ఉందా.. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవడానికి కింది స్టెప్స్ అనుసరించండి.

  • ముందుగా ఈసీఐ వెబ్‌సైట్ లింక్ చేయాలి.

  • అక్కడ ఓటరు జాబితాలో 3 ఆప్షన్లు కనిపిస్తాయి. అవి సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్, సెర్చ్ బై మొబైల్

  • వెబ్‌సైట్‌కి వెళ్లగానే మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. 1. సెర్చ్ బై డీటెయిల్స్, 2. సెర్చ్ బై ఎపిక్, 3. సెర్చ్ బై మొబైల్

  • ఎపిక్ ఆప్షన్‌ని ఎంపిక చేసుకొని.. మీ ఎపిక్ నంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రాన్ని ఎంపిక చేయాలి.

  • ఆ తర్వాత కింద పేర్కొన్న Captcha Code ని ఎంటర్ చేసి, సెర్చ్ ఆప్షన్ మీద నొక్కాలి.

  • అప్పుడు తెలంగాణలోని ఓటరు జాబితాలో మీ పేరు, వివరాలు తెరపై కనిపిస్తాయి.

  • ఒకవేళ ఎపిక్ నంబర్ గురించి తెలియకపోతే.. మీ పేరు, పుట్టిన తేదీ, అసెంబ్లీ నియోజకవర్గం వంటి వ్యక్తిగత వివరాల ద్వారా ఓటరు జాబితాలో మీ పేరుని శోధించవచ్చు.


లేదా

  • వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. మీ రాష్ట్రం, భాషను ఎంచుకోండి.

  • మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి.

  • ఫోన్‌కి వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను స్వీకరించడానికి "OTP పంపండి"పై క్లిక్ చేయండి.

  • స్మార్ట్‌ఫోన్‌లో OTPని ఎంటర్ చేసి, శోధనపై క్లిక్ చేయండి.

మీరు ఈ రెండు పద్ధతుల్లో దేనినైనా అనుసరించిన తర్వాత, ఓటరు జాబితాలో పేరును కనుక్కోగలరు. వ్యక్తిగత వివరాలు, పోలింగ్ స్టేషన్, ధృవీకరించిన పోలింగ్ తేదీ, ఎన్నికల అధికారుల వివరాలను కూడా చూడగలరు. ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) లేదా బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)ని సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 01:12 PM

Advertising
Advertising