Childrens Day 2024: బాలల దినోత్సవం సందర్భంగా మీ పిల్లల స్క్రీన్ టైం ఇలా తగ్గించండి.. ఇవి కూడా నేర్పించండి..
ABN, Publish Date - Nov 14 , 2024 | 07:15 AM
ప్రస్తుత కాలంలో అనేక మంది పిల్లలు మొబైల్ ఫోన్లు, గాడ్జెట్‌లకు ఎక్కువగా అలవాటు పడ్డారు. దీంతో వారికి ఊబకాయం సహా అనేక వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో నేడు (నవంబర్ 14) బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల స్క్రీన్ సమయాన్ని ఎలా తగ్గించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నేటి డిజిటల్ యుగంలో పిల్లలు మొబైల్ (smart phones), గాడ్జెట్‌లపై ఎక్కువ సమయం గడపుతున్నారు. దీని కారణంగా వారి శారీరక శ్రమ తగ్గిపోతుంది. అంతేకాదు ఎక్కువ సమయం ఫోన్ ముందు గడపడం వల్ల పిల్లల్లో ఊబకాయం, బద్ధకం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువవుతోంది. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ తరహా జీవనశైలి పిల్లల గుండె ఆరోగ్యంపై కూడా చాలా ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఇలాంటి పరిస్థితిలో మీ పిల్లల స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం, వారిని సరదాగా ఫిట్‌నెస్ కార్యకలాపాలకు మళ్లీంచడం చాలా ముఖ్యం. తద్వారా వారు ఎల్లప్పుడూ ఫిట్‌గా, చురుకుగా ఉంటారు. అయితే నేడు (నవంబర్ 14) బాలల దినోత్సవం ( Childrens Day 2024) సందర్భంగా పిల్లల స్క్రీన్ టైం తగ్గించి, శారీరక శ్రమవైపు ఎలా మళ్లీంచాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
డ్యాన్స్ పార్టీ: పిల్లలకు ఇష్టమైన పాటలకు ప్రతి వారం డ్యాన్స్ పార్టీని నిర్వహించండి. దీంతో పిల్లల శరీరం చురుగ్గా ఉండడంతోపాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
అవుట్‌డోర్ స్కావెంజర్ హంట్: మీ ఇంటి చుట్టూ లేదా పార్క్‌లో పిల్లలు వస్తువుల కోసం పరిగెత్తే స్కావెంజర్ హంట్ గేమ్‌ను ప్లాన్ చేయండి. ఇది వారి హృదయానికి గొప్ప వ్యాయామం అవుతుంది.
స్కేటింగ్: పిల్లలతో బయట స్కేటింగ్ చేయండి. ఇది వారి హృదయాన్ని దృఢపరచడమే కాకుండా, స్క్రీన్‌కు దూరంగా ఉంచుతుంది.
అవుట్‌డోర్ గేమ్‌లు: క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి బహిరంగ ఆటలలో పిల్లలతో పాల్గొనండి. ఈ ఆటల ద్వారా పిల్లలు శారీరకంగా చురుకుగా మారుతారు.
తోటపని: మొక్కలకు నీరు పట్టడం, కత్తిరింపు చేయడం లేదా మట్టిలో ఆడుకోవడం వంటి తోటపనిలో పిల్లలను పాల్గొనేలా చేయండి. ఇది వారికి తేలికపాటి వ్యాయామాన్ని ఇస్తుంది. దీంతోపాటు ఇది గుండెకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
మినీ స్పోర్ట్స్ టోర్నమెంట్: ప్రతి నెలా ఇంట్లో చిన్న స్పోర్ట్స్ టోర్నమెంట్ నిర్వహించండి. దీనిలో పిల్లలు టేబుల్ టెన్నిస్, ఫుట్‌బాల్ లేదా బ్యాడ్మింటన్ వంటి పోటీ ఆటలను ఆడుకోవచ్చు
స్క్రీన్ సమయంపై పరిమితులు: తల్లిదండ్రులు పిల్లల స్క్రీన్ సమయంపై పరిమితులను సెట్ చేయాలి. పిల్లలకు రోజుకు 2 గంటల కంటే ఎక్కువ స్క్రీన్ సమయం ఉండకూడదనే నియమాన్ని రూపొందించాలి.
ప్రత్యామ్నాయాలను అందించండి: టీవీ చూడటం మీ పిల్లలకు అలవాటుగా మారవచ్చు. కానీ వారి స్క్రీన్ సమయాన్ని నివారించడానికి మీరు బయట ఆడటం లేదా కుటుంబం, స్నేహితులతో సమయం గడపడం వంటి ఇతర ప్రత్యామ్నాయాలను వారికి అందించాలి. ఈ కార్యకలాపాలు క్రమంగా చేయడం వల్ల మీ పిల్లల స్క్రీన్ సమయాన్ని తగ్గించడమే కాకుండా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.
ఇవి కూడా చదవండి:
Childrens Day 2024: చిల్డ్రన్స్ డే స్పెషల్.. మీ పిల్లలను ఇలా సర్ ప్రైజ్ చేయండి..
Vegetable Prices: షాకింగ్.. త్వరలో పెరగనున్న కూరగాయల ధరలు, కారణమిదేనా...
Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..
Jobs: గుడ్‌న్యూస్ త్వరలో 3.39 కోట్ల ఉద్యోగాలు.. ఏ రంగంలో ఉంటాయంటే.
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 14 , 2024 | 07:18 AM