Share News

Delhi: భార్య తెచ్చిన కట్నంపై భర్తకు హక్కు ఉండదు.. తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు

ABN , Publish Date - Apr 26 , 2024 | 10:12 AM

భార్య స్త్రీ నిధి (కట్నం)పై భర్తకు హక్కు ఉండదని, ఆపద సమయంలో దానిని ఉపయోగించినప్పటికీ, భార్యకు తిరిగి ఇచ్చేయాలని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఓ కేసుపై గురువారం విచారించిన ధర్మాసనం మహిళ కోల్పోయిన బంగారానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని భర్తను ఆదేశించింది.

Delhi: భార్య తెచ్చిన కట్నంపై భర్తకు హక్కు ఉండదు.. తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు

ఢిల్లీ: భార్య స్త్రీ నిధి (కట్నం)పై భర్తకు హక్కు ఉండదని, ఆపద సమయంలో దానిని ఉపయోగించినప్పటికీ, భార్యకు తిరిగి ఇచ్చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court) పునరుద్ఘాటించింది. ఓ కేసుపై గురువారం విచారించిన ధర్మాసనం మహిళ కోల్పోయిన బంగారానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని భర్తను ఆదేశించింది.

ఇంతకు ఏం జరిగిందంటే.. కేరళకు చెందిన ఓ మహిళ తనకు పుట్టింటివారు ఇచ్చిన 89 గ్రాములు బంగారాన్ని భర్త తన అవసరాల మేరకు వాడుకున్నారని ఆరోపిస్తూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.


పెళ్లైన తొలి రాత్రే భర్త తన నగలన్నీ తీసుకుని ఆయన తల్లికి అందజేశాడని.. కారణం అడిగితే జాగ్రత్తపరచడానికి అని చెప్పి.. తన హక్కుల్ని పూర్తిగా లాక్కున్నారని భార్య ఆరోపించింది. ఆ బంగారాన్ని అప్పటికే వారి కుటుంబానికి ఉన్న అప్పులు కట్టడానికి వినియోగించారని ఆమె తెలిపింది. బంగారం గురించి అడిగితే భర్త, అత్త బెదిరించేవారని 2011లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. భర్త చేసింది తప్పేనని ఫ్యామిలీ కోర్టు తీర్పు వెలువరించింది.

దీంతో భర్త కేరళ హైకోర్టు మెట్లెక్కాడు. అయితే హైకోర్టు భర్తకు అనుకూల తీర్పు ఇచ్చింది. ఆమె నగలను భర్త దుర్వినియోగం చేసినట్లు నిరూపితం కాలేదని తెలుపుతూ భార్య పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో భార్య సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం విచారించి తీర్పు వెలువరించారు.


Delhi: రెండో దశ బరిలో హేమాహేమీలు.. రాహుల్, హేమమాలిని భవితవ్యం తేలేది నేడే

"కట్నం ఉమ్మడి ఆస్తి రాదు. ఆమెకు సొంతంగా సంక్రమించిన ఆస్తి, నగలు, ధనాన్ని భర్త ఏ అవసరానికి వాడుకోరాదు. వాడుకుంటే తప్పనిసరిగా ఆమెకు తిరిగి ఇవ్వాలి. భార్యకు పెళ్లికి ముందు కానీ , పెళ్లి దశలో కానీ , అప్పగింతలు లేదా ఆ తరువాతి దశల్లో ఏ రూపంలో అయినా పుట్టింటి నుంచి ధనం, ఆస్తి అందితే అది పూర్తిగా భార్యకే చెందుతుంది. భార్య దాన్ని ఇష్టానుసారంగా వాడుకునే అవకాశం ఉంటుంది.. కానీ భర్తకు ఎలాంటి హక్కులు ఉండవు. కష్టాల్లో భర్త వాడుకున్నా మళ్లీ తిరిగి భార్యకకు ఇచ్చేయాలి. వివాహ బంధాలకు సంబంధించిన విషయాలను సూటిగా చెప్పలేం. బంగారాన్ని వాడుకుని తిరిగి ఇవ్వనందుకు భర్త రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలి" అని ధర్మాసనం స్పష్టం చేసింది.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 10:12 AM