Mehbooba Mufti: బంగ్లా, భారత్ మధ్య తేడా లేదు.. మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 01 , 2024 | 09:33 PM
బంగ్లాదేశ్‌లో హిందువులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయనీ, భారత్‌లోనూ మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతుంటే భారత్‌కూ బంగ్లాదేశ్‌కూ తేడా ఏమిటని ప్రశ్నించారు. తనకు ఎలాంటి తేడా కనిపించడం లేదన్నారు.
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై అప్రతిహతంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో పీడీపీ అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 24న సంభాల్‌లో జరిగిన ఘటనను పోలుస్తూ, ఇండియాలోని మైనారిటీల పరిస్థితిని బంగ్లాదేశ్‌తో పోల్చారు.
ISKCON: బంగ్లాలో హిందువులపై అకృత్యాలకు నిరసనగా ఇస్కాన్ సామూహిక ప్రార్థనలు
బంగ్లాదేశ్‌లో హిందువులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయనీ, భారత్‌లోనూ మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతుంటే భారత్‌కూ బంగ్లాదేశ్‌కూ తేడా ఏమిటని ప్రశ్నించారు. తనకు ఎలాంటి తేడా కనిపించడం లేదన్నారు. ''1947 నాటి పరిస్థితి గుర్తొచ్చి ఈరోజు నాకు భయమేస్తోంది. ఉద్యోగాలు గురించి యువత అడుగుతుంటే వారికి ఉద్యోగాలు రావడం లేదు. మనకు మంచి ఆసుపత్రులు, విద్య లేవు. వాళ్లు రోడ్ల పరిస్థితి మెరుగుపరచడం లేదు కానీ ఆలయాల అన్వేషణ పేరుతో మసీదులు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. సంభాల్ ఘటన దురదృష్టకరం. దుకాణాల్లో పనిచేస్తున్న వారిపై కూడా కాల్పులు జరిపారు'' అని ముఫ్తీ అన్నారు.
రాజస్థాన్‌లోని ప్రఖ్యాత సుఫీ ప్రవక్త మొయినుద్దీన్ చిష్టీ దర్గా విషయంలోనూ ఇలాంటి వివాదమే రేపారని ముఫ్తీ అన్నారు. అన్ని మతాల వారు అక్కడ ప్రార్థనలు చేస్తారని, సంఘీభావానికి చిహ్నమని గుర్తుచేశారు. ఇప్పుడు అక్కడ కూడా ఆలయం ఉందంటూ తవ్వకాలు జరిపే ప్రయత్నాలు చేస్తు్న్నారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి
Mohan Bhagwat: సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై మోహన్ భగవత్ ఆందోళన
Fire Accident: 61 మంది భక్తులతో వెళ్తున్న బస్సుకు భారీ అగ్ని ప్రమాదం.. చివరకు..
Heavy Raind: చెన్నై నగరాన్ని ముంచెత్తిన ‘ఫెంగల్’..
Read More National News and Latest Telugu News
Updated Date - Dec 01 , 2024 | 09:38 PM