Agniveers passing out parade: ‘అగ్నివీర్’పై భారత నేవీ చీఫ్ ప్రశంసల జల్లు
ABN, Publish Date - Aug 10 , 2024 | 11:06 AM
ఒడిశాలోని ఐఎన్ఎస్ చిలుకలో అగ్నివీర్ నాల్గవ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మొదటి మూడు బ్యాచ్‌ల్లో 2,500 మంది శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరారని తెలిపారు. 2022లో అగ్నివీర్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.
భువనేశ్వర్, ఆగస్ట్ 10: అగ్నివీర్ పథకం దిగ్విజయంగా ముందుకు సాగుతుందని భారత నేవీ చీఫ్ ఆడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠీ వెల్లడించారు. శుక్రవారం ఒడిశాలోని ఐఎన్ఎస్ చిలుకలో అగ్నివీర్ నాల్గవ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మొదటి మూడు బ్యాచ్‌ల్లో 2,500 మంది శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరారని తెలిపారు. 2022లో అగ్నివీర్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఆ సమయంలో తాను చీఫ్ ఆఫ్ పర్సల్‌గా విధులు నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
Also Read: Manish Sisodia: భార్యతో సెల్ఫీ తీసుకుని.. తనదైన శైలిలో స్పందించిన మనీశ్
300 మంది మహిళలు..
ఈ నాలుగో బ్యాచ్‌లో మొత్తం 1,429 మంది అగ్నివీరులున్నారని తెలిపారు. వారిలో 300 మంది మహిళలు ఉన్నారన్నారు. అగ్నివీరుల తొలి బ్యాచ్‌లో కనిపించిన ఉత్సాహం, ప్రేరణ, విశ్వాసం అంతా ఈ బ్యాచ్‌లో సైతం సుస్పష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఒడిశాలోని ఐఎన్ఎస్ చిలుకలో నిర్వహించిన 16 వారాల కఠోర శిక్షణా కార్యక్రమాన్ని వారు పూర్తి చేసుకున్నారు.
Also Read: Wayanad: ప్రముఖ నటుడు మోహన్ లాల్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యూట్యూబర్ అరెస్ట్
2022, జూన్‌లో అగ్నివీర్ పథకం...
సాయుధ దళాల్లోకి యువతను ప్రోత్సహించేందుకు అగ్నివీరు పథకం తీసుకు రావాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగా 2022, జూన్‌లో ఈ అగ్నివీర్ పథకాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ పథకంలో చేరిన వారిని అగ్నివీరులుగా పేర్కొంటారు. ఈ పథకానికి ఎంపికైన వారి సేవలను నాలుగు ఏళ్ల పాటు సాయుధ దళాల్లో వినియోగించుకోనున్నారు. ఆ కాలం పూర్తయిన తర్వాత.. వారిలోని 25 శాతం మంది అగ్నివీరులు భారత సాయుధ దళాలలో కనీసం 15 సంవత్సరాల పాటు సాధారణ కేడర్‌లో పని చేస్తారు.
Also Read: wayanad landslides: నేడు వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
నాలుగేళ్ల తర్వాత 75 శాతం మంది బయటకు..
అయితే మిగిలిన 75 శాతం మంది అగ్నివీరులకు తదుపరి ఉపాధి అవకాశాలు అందేలా ప్రభుత్వం సహయ సహకారాలు అందిస్తుంది. అంతేకాదు. ఈ నాలుగేళ్ల అనంతరం 75 శాతం మంది బయటు వచ్చేన అగ్నివీరులకు రూ. 11.72 లక్షల సేవా నిధి ప్యాకేజీ రూపంలో అందజేయబడుతుంది. దీని ఆదాయపు పన్ను నుంచి మినహాయించబడుతుంది. అలాగే వీరికి పెన్షన్ ప్రయోజనాలు సైతం ఉండవన్న సంగతి తెలిసిందే.
ప్రతిపక్షాల విమర్శలు..
ఈ అగ్నివీర్ పథకంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీనే కాదు.. ఉత్తర భారతంలోని పలు రాజకీయ పార్టీలు సైతం తీవ్రంగా వ్యతిరేకించాయి. భారత సాయుధ దళాల్లో విధులు నిర్వహేంచే వారికి పెన్షన్ ఎగ్గొట్టే ప్రయత్నంలో భాగంగానే మోదీ ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుందని విమర్శులు సైతం గుప్పించాయి. ఇక ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన బిహార్‌లోని అధికార జేడీఎస్ అయితే.. అగ్నివీర్ పథకంపై పునరాలోచన చేయాలని మోదీ ప్రభుత్వానికి సూచించిన విషయం విధితమే.
బీజేపీ పాలిత రాష్ట్రాలు.. అగ్నివీరులకు ఆఫర్లు..
ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అగ్నివీర్ పథకంలో నాలుగేళ్లు విధులు నిర్వహించిన తమ రాష్ట్ర వాసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించాయి. ఆ జాబితాలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలున్నాయి.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 10 , 2024 | 11:08 AM